Repolling in Arunachal pradesh: దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికల్లో మొత్తం102 లోక్‌సభ స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీకు ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
దేశంలోని 102 లోక్‌సభ స్థానాలకు తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా తొలి విడతలోనే జరిగాయి. ఈ సందర్భంగా హింస చెలరేగి కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు దెబ్బతిన్నాయి. దాంతో అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమోంగ్ జిల్లా బమెంగ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న సరియో, కురుంగ్ కుమే, న్యాపిన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని లంగేతే లత్, దింగ్సర్, బొగియో సియుుమ్, జింబారి, నాకో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని లెంగి మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 24 వతేదీ ఉదయం 6 గంటల్నించి మద్యాహ్నం 2 గంటల వరకూ రీ పోలింగ్ నిర్వహించనున్నారు.
తొలి విడత ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. మొత్తం 60 మంది సభ్యులున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 10 మంది ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక రెండవ విడత పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన జరగనుంది. తరువాత మే 7న మూడో విడత, 13న నాలుగో విడత, మే 20న ఐదవ విడత, మే 25న ఆరవ విడత, జూన్ 1న ఏడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 26న జరిగే రెండో విడతలో కర్ణాటక లోక్‌సభ ఎన్నికలున్నాయి.
Also read: DRR Studio: ప్రముఖ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన షూటింగ్ సామగ్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook