Shyam rangeela contensting against pm modi from varanasi: దేశ ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ కమెడియన్ శ్యామ్ రంగీలా చాలా ఫెమస్ అయ్యారు. ఆయన లోక్ సభ ఎన్నికలలో వారణాసి నుంచి బరిలో ఉంటున్నట్లు కూడా పేర్కొన్నారు. తనకు మోదీ అంటే ఎంతో ఇష్టమని అందుకే ఆయనను ఎక్కువగా అనుకరిస్తుంటానని పేర్కొన్నారు. అంతే కాకుండా..ఆయన అనేక మంది రాజకీయ నేతల వాయిస్ ను ఇమిటెట్ చేస్తుంటారు. ఆయన తాజాగా, ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీనిలో తన గురించి చేసుకుంటూ.. వారణాసి నుండి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రజలకు నుంచి తనకు అనూహ్యంగా మంచి స్పందన వచ్చిందని కూడా వ్యాఖ్యలుచేశారు. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు ఎంతో సంతోషం కల్గుతుందని అన్నాడు.
वाराणसी मैं आ रहा हूँ…#ShyamRangeelaForVaranasi pic.twitter.com/8BOFx4nnjn
— Shyam Rangeela (@ShyamRangeela) May 1, 2024
మోదీ తరచుగా అనేక పబ్లిక్ సమావేశాలలో మాట్లాడుతూ.. ఎవ్వరికి అర్ధమయ్యే లాంగ్వేజ్ లో వాళ్లకు అదే విధంగా సమాధానం చెప్తానన అంటుంటారని గుర్తు చేశాడు. తాను కూడా ఇప్పుడు మోదీకి అర్ధమయ్యే విధంగా ఆయన లాంగ్వేజ్ లో సమాధానం చెప్తానంటూ కూడా శ్యామ్ రంగీలా సెటైర్ వేశారు. తన నామినేషన్, ఎన్నికల్లో పోటీ చేయడంపై నా అభిప్రాయాలను త్వరలో వీడియో ద్వారా మీకు తెలియజేస్తానని వెల్లడించారు. అదే విధంగా ఎన్నికల్లో ఏవిధంగా నామినేషన్ వేయాలి, ఫార్మాలిటీస్ లు తనకు తెలియదని,దయచేసి తనకు మద్దతుగా ఉండాలని కూడా ఆయన కోరారు.
అదే విధంగా.. 2014లో నేను ప్రధాని నరేంద్ర మోదీకి ఫాలోయర్‌నని.. ప్రధానికి మద్దతుగా పలు వీడియోలు షేర్ చేశానని.. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లకు వ్యతిరేకంగా కూడా వీడియోలు షేర్ చేశానని.. వాటిని చూస్తే ఎవరైనా అనొచ్చు. వచ్చే 70 ఏళ్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటేస్తానంటూ కూడా ఆయన అనేక వీడియోలు చేశారు. కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి మారింది... ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటు శ్యామ్ రంగీలా పేర్కొన్నారు.
అందుకే వారణాసిలో బరిలో ఉండటానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాబట్టి, ఈ వారం వారణాసికి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపాడు. కొందరు తాను నామినేషన్ వేస్తున్నానగానే.. ఈ కమెడియన్ జోక్ చేస్తున్నాడా ఏంటని కామెంట్లు చేశారని, కానీ మరికొందరు మాత్రం ఆయనను స్వాగతీస్తున్నట్లు పేర్కొన్నాడు. తనను ప్రజలు ఆశీర్వదించాలంటూ కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం మోదీకి వ్యతిరేకంగా.. ఒక కమెడీయన్ ఎన్నికల బరిలో ఉండటం మాత్రం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter