Punjab New Advocate General: పంజాబ్ కొత్త అడ్వకేట్ జనరల్‌గా నియమితులైన అన్మోల్ రతన్ సిద్ధూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి వేతనంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటానని పేర్కొన్నారు. తన వేతనం ప్రభుత్వానికి భారంగా మారకూడదన్నారు. ప్రభుత్వం తరుపున కేసులను పూర్తి పారదర్శకతతో వాదిస్తానని తెలిపారు. ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రతన్ సిద్ధూ సుదీర్ఘ కాలంగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. పంజాబ్ హైకోర్టులో ఎన్నో సున్నితమైన కేసులతో పాటు సివిల్, క్రిమినల్, భూవివాదాలు, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. రతన్ సిద్ధూ సేవలకు గాను పంజాబ్ ప్రభుత్వం ఆయనకు ఆ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం 'పర్మాన్ పాత్ర'ను అందుకున్నారు.
రతన్ సిద్ధూ మే 1, 1958న జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1981-1982 కాలంలో పంజాబ వర్సిటీ స్టూడెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1985లో ఆయన న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. 1993లో పంజాబ్ డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 2005వరకు అదే హోదాలో కొనసాగారు. ఆ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. 2003-04లో పంజాబ్ యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు.
Also Read: Shalini Pandey Pics: అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే లేటెస్ట్ ఫొటోలు..
Also read : RRR: 'ఆర్ఆర్ఆర్'కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్ల పెంపునకు అనుమతి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook