ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ క్రేజీవాల్ కు ఆదాయపన్ను శాఖ షాక్ ఇచ్చింది. రూ.30 కోట్ల 67 లక్షల ఆదాయానికి సంబంధించి లెక్క చూపాలని నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 7వ తేదీ లోపు సమాధానమివ్వాలని.. లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది.
నోటీసు ప్రకారం 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆమ్ ఆద్మీ పార్టీకి పన్ను చెల్లించవలసిన ఆదాయం 68.44 కోట్లుగా అంచనా వేయబడింది. కానీ పార్టీ 13 కోట్ల రూపాయల విరాళాన్ని వెల్లడించలేదు అని అందులో ప్రస్తావించింది. 462 మంది దాతల నుండి
డబ్బులు సేకరించిన వివరాలను రికార్డు చేయలేదని, ఆ డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని పేర్కొనింది. ఇదే ఏడాదిలో ఆప్ పార్టీకి కేంద్ర మంత్రిత్వ శాఖ విదేశాల నుండి డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని అడిగింది. కానీ ఆప్ పార్టీ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ను తుంగలో తొక్కిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా ద్వారా 2 కోట్ల రూపాయలు ముట్టాయని ఒక అపవాదం ఉంది.
#Delhi: Income Tax department sends Rs 30.67 crore tax notice to Delhi CM Arvind Kejriwal's Aam Aadmi Party
— ANI (@ANI) November 27, 2017