Oxygen Recycling system: కరోనా మహమ్మారి ధాటికి ఏర్పడిన విపత్కర పరిస్థితులతో జనం అల్లాడిపోతున్నారు. వేలాదిమందికి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అందుకే ఇండియన్ నేవీ రూపొందించిన సరికొత్త పరికరం చర్చనీయాంశంగా మారుతోంది. ఆక్సిజన్ అవసరాల్ని తక్కువ ఖర్చులో తీర్చేదిగా కన్పిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతితో శ్వాస సమస్యలు తలెత్తడంతో వేలాదిమందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. ఆక్సిజన్ కొరత ఏర్పడి వందలాది ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియన్ నేవీ సరికొత్త పరికరాన్ని రూపొందించింది. అదే ఆక్సిజన్ రీ సైక్లింగ్ సిస్టమ్(Oxygen Recycling System). ఓఆర్ఎస్గా పిలుస్తున్న ఈ పరికరం ఉపయోగించి సాధారణ సిలిండర్‌ను 2-4 రెట్లు ఎక్కువగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ పరికరం వృధా అవుతున్న ఆక్సిజన్‌ను అరికడుతుంది. సాధారణంగా మనం పీల్చే గాలి నుంచి కొంత ఆక్సిజన్‌ను మాత్రమే ఊపిరితిత్తులు పీల్చుకుంటాయి. మిగిలినదానికి కార్బన్ డయాక్సైడ్ తోడై బయటకు పోతుంది. ఈ వృధాను అరికట్టేందుకే ఈ ఓఆర్ఎస్(ORS) పరికరం.
నేవీ డైవింగ్ స్కూల్‌కు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ మయాంక్ శర్మ ఈ పరికరాన్ని డిజైన్ చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పూర్తి స్థాయిలో పనిచేయగల నమూనాను రూపొందించారు. రోగులు ఆక్సిజన్ పీల్చి వదిలినప్పుడు అందులో కొంతమాత్రమే వినియోగమవుతుంటుంది. మిగిలిన ఆక్సిజన్, శరీరంలో ఉత్పత్తయ్యే కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్లిపోతుంది. ఇందులోని ఆక్సిజన్‌ను తిరిగి వినియోగించుకుని కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపడమే ఓఆర్ఎస్ (ORS) వ్యవస్థ చేసే పని. సాధారణంగా అయితే ద్రవ ఆక్సిజన్‌ను నేరుగా వినియోగించేందుకు వీలుకాదు. నేవీ పరికరంతో మాత్రం నేరుగా ద్రవ ఆక్సిజన్‌ను ఉపయోగించుకోవచ్చు. నేవీ( Indian Navy) తయారు చేసిన ఓఆర్ఎస్ ప్రాధమిక నమూనాకు కేవలం పదివేల రూపాయలే ఖర్చవుతుంది. దీని వల్ల రోజుకు 3 వేల వరకూ ఆదా చేయవచ్చు. ఓఆర్ఎస్ పరికరం వల్ల కేవలం ఆక్సిజన్ అవసరమైన రోగులకే కాకుండా..హిమాలయాల వంటి పర్వతాల్ని అధిరోహించేవారికి, ఎత్తైన ప్రాంతాల్లో పనిచేసే సైనికులు, జలాంతర్గాములు, సముద్రలోతుల్లో అన్వేషణ చేసేవారికి ఉపయోగపడుతుంది.
Also read: Sputnik v to Delhi: ఢిల్లీ ప్రజలకు త్వరలో ఉచితంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook