5 State Elections 2023: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. తెలంంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ , మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణలో 119 నియోజకవర్గాలు, రాజస్థాన్‌లో 200, మద్యప్రదేశ్‌లో 230, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరాంలో 40 నియోజకవర్గాలున్నాయి. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా, రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది ఉన్నారు. ఇక మద్యప్రదేశ్‌లో 5.6 కోట్లమంది, ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఉండగా మిజోరాంలో 8.52 లక్షలమంది ఓటర్లున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న వెలువడనుంది. నవంబర్ 10 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 13న స్క్రూటినీ ఉంటుంది. ఇక నవంబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది.
ఇక రాజస్థాన్ ఎన్నికలకు నోటిఫికేషన్ అక్టోబర్ 30న విడుదల కానుండగా, నవంబర్ 6 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 9లోగా నామినేషన్లు ఉపసంంహరించుకోవల్సి ఉంటుంది. ఇక నవంబర్ 23న పోలింగ్ జరుగుతుంది. ఇక మద్యప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 21న విడుదల కానుండగా, అక్టోబర్ 30 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 2న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా పోలింగ్ నవంబర్ 17 న ఉంటుంది. మిజోరాం ఎన్నికలకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ వెలవడనుంది. అక్టోబర్ 20 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 23లోగా నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. పోలింగ్ నవంబర్ 7 ఉంటుంది.
ఛత్తీస్‌గఢ్ తొలి దశ పోలింగ్‌కు సంబంధించి అక్టోబర్ 13న నోటిఫికేషన్ వెలువడుతుంది. అక్టోబర్ 20లోగా నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 23 నామినేషన్ల ఉపసంహణకు చివరి తేదీ ఉంటుంది. పోలింగ్ నవంబర్ 7న ఉంటుంది. రెండవ దశ పోలింగ్‌కు అక్టోబర్ 21న నోటిఫికేషన్ వెలువడనుండగా అక్టోబర్ 30 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక నవంబర్ 2లోగా నామినేషన్లు ఉపసంహరణ జరగాలి. నవంబర్ 17న పోలింగ్ ఉంటుంది. ఈ అన్ని రాష్ట్రాల కౌంటింగ్ ప్రక్రియ డిసెంబర్ 3వ తేదీన జరగనుంది.
Also read: TS Election Schedule 2023: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా, పోలింగ్ తేదీ, అభ్యర్ధుల వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook