71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఆర్పీఎఫ్ మహిళా జవాన్లు మోటార్ బైక్స్పై చేసిన హ్యూమన్ పిరమిడ్ విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే హమ్ కిసీ సే కమ్ నహీ హై అన్నట్టుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళామణులు.. సీఆర్పీఎఫ్లోనూ చేరి దేశ సేవ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఆర్పీఎఫ్ మహిళా జవాన్ల (CRPF women soldiers) విభాగం నుంచి 21 మంది మహిళా జవాన్లు హ్యామన్ పిరమిడ్ ఏర్పాటు చేస్తూ ఐదు మోటార్ బైకులపై విన్యాసాన్ని ప్రదర్శించారు. అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ వివి అనితా కుమారి నేతృత్వంలో సీఆర్పీఎఫ్ జవాన్లు చేసిన ఈ విన్యాసంపై మీరూ ఓ లుక్కేయండి.
#WATCH: CRPF's 21 women dare devils on five motorcycles make a human pyramid. Assistant Sub Inspector Anita Kumari VV leads this formation. #RepublicDay pic.twitter.com/2OQtsro9si
— ANI (@ANI) January 26, 2020