India Covid-19: కొత్తగా 20వేల కరోనా కేసులు నమోదు

దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతకొన్ని రోజులతో పోల్చుకుంటే దేశంలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య రెండూ కూడా తగ్గుముఖం పట్టాయి.

Last Updated : Dec 28, 2020, 10:13 AM IST
India Covid-19: కొత్తగా 20వేల కరోనా కేసులు నమోదు

India Coronavirus Cases Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతకొన్ని రోజులతో పోల్చుకుంటే దేశంలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య రెండూ కూడా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 20వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం (డిసెంబరు 27న) కొత్తగా 20,021 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 279 మంది మరణించారు. 

ఈ గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,07,871 కి చేరగా.. మరణాల సంఖ్య 1,47,901 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 95.83 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also Read: Rajinikanth: ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్‌

ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి 21,131 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 97,82,669 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,77,301 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

Also Read: Covid-19: ఇదే చివరి మహమ్మారి కాదు: WHO

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News