Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశశ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 46వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గింది. దీంతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో బుధవారం ( నవంబరు 18న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 45,576 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 585 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,58,484 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,31,578 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Covaxin: కోవ్యాక్సిన్ వాలంటీర్‌గా హర్యానా మంత్రి అనిల్ విజ్
అయితే నిన్న కరోనా నుంచి 48,493 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 83,83,603 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,43,303 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.58 శాతం ఉండగా.. మరణాల రేటు 1.47 శాతం ఉంది. Also read: Covid-19: ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు
ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 10,28,203 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 18వ తేదీ వరకు దేశంలో మొత్తం 12,85,08,389 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఎసీఎంఆర్ వెల్లడించింది.
Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి