will support Sharad Pawar as UPA chairperson; Shiv Sena | న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ( Congress ) బలహీనపడిందని.. యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) నియమితులైతే తమకు సంతోషమేనని శివసేన ప్రకటించింది. యూపీఏ చైర్మన్ (upa chairman) గా శరద్ పవార్‌ను నియమిస్తే తమ పార్టీ (Shiv Sena )మద్దుతునిస్తుందని మహారాష్ట్ర అధికారపార్టీ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ ( Sanjay Raut ) మీడియాతో మాట్లాడారు.
We'll be happy if Pawar sir becomes UPA chairman. But I've heard that he's personally refused it. We will support him if such a proposal comes to the fore officially. Congress is weak now so the opposition needs to come together & strengthen the UPA: Sanjay Raut, Shiv Sena leader pic.twitter.com/3NNHEjCmPu
— ANI (@ANI) December 11, 2020
యూపీఏ చైర్మన్‌గా (Nationalist Congress Party) శరద్ పవార్ బాధ్యతలు స్వీకరిస్తే తమకు సంతోషమేనని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ బాధ్యతను స్వీకరించడానికి పవార్ సిద్ధంగా లేరన్న విషయం తెలిసిందని.. ఒకవేళ అలాంటి ప్రతిపాదన అధికారికంగా వస్తే మాత్రం తాము ఖచ్చితంగా మద్దతిస్తామని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ బలహీనపడిందని.. ప్రతిపక్షాలన్నీ కలిసి యూపీఏ ( UPA ) ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సంజయ్ రౌత్ అన్నారు. ఈ సందర్భంగా రేపు శరద్ పవార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. Also read: Tirumala: ఆన్లైన్లో ‘వైకుంఠ ద్వార దర్శనం’ టికెట్లు
ఇదిలాఉంటే.. ఇప్పటివరకూ ఈ పదవి నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ( Sonia Gandhi ) త్వరలో ఈ బాధ్యత నుంచి తప్పుకుంటారని రెండు రోజుల నుంచి వార్తాకథనాలు వెలువడుతున్నాయి. సోనియా గాంధీ ఈ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని.. తన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మరాఠా నేత శరద్ పవార్‌ను యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ( UPA ) చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయని పలువురు పేర్కొంటుండటం చర్చనీయాంశంగా మారింది.
Also read: Tamannaah: లిప్‌లాక్.. ఆ హీరోతో అయితే ఓకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe