BSF Job Notification: అగ్నిపథ్‌ జ్వాలల వేళ బీఎస్‌ఎఫ్‌ కీలక నిర్ణయం..281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..!

BSF Job Notification: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ మంటలు కొనసాగుతున్న వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 18, 2022, 11:59 PM IST
  • దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ మంటలు
  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కీలక నిర్ణయం
  • ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
BSF Job Notification: అగ్నిపథ్‌ జ్వాలల వేళ బీఎస్‌ఎఫ్‌ కీలక నిర్ణయం..281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..!

BSF Job Notification: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ మంటలు కొనసాగుతున్న వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) కీలక నిర్ణయం తీసుకుంది. 281 ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. టెన్త్,ఇంటర్, డిగ్రీ విద్యార్హతలను బట్టి పోస్టులను కేటాయించారు. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులు.

ఈనెల 28లోపు బీఎస్‌ఎఫ్‌ అధికారిక సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు..ఈపోస్టులకు అర్హత సాధించాలంటే రాతపరీక్ష, డాక్యుమెంటేషన్‌, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్‌ల్లో పాస్‌ కావాల్సి ఉంది. ఎంపికైన వారికి పోస్టులు కేటాయిస్తారు. నెలకు రూ.35 వేల 400 బేసిక్‌ పేతోపాటు ఇతర అలవెన్సులు, అదనపు బెనిఫిట్స్ కల్పిస్తారు. అత్యంత పారదర్శకంగా పోస్టులను భర్తీ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో బీఎస్‌ఎఫ్‌ నుంచి నోటిఫికేషన్‌ రావడం చర్చనీయాంశంగా మారింది. అగ్నిపథ్‌తో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఉండదన్న ప్రచారం జరుగుతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అగ్నిపథ్‌పై అనవసర రాద్ధాంతం చేయొద్దని ఇప్పటికే విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

గత నాలుగు రోజులుగా జరుగుతున్న హింసాకాండలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఒక్క సికింద్రాబాద్ అల్లర్లల్లో రూ.30 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఈఘటనలో దాదాపు 500 మంది పాల్గొనట్లు పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్ గ్రూప్ ఆధారంగా ఇప్పటివరకు 200 మందిని గుర్తించారు. వంద మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. త్వరలో మరికొంత మందిని గుర్తిస్తామంటున్నారు పోలీసులు.

Also read: DK Aruna on Harish Rao: అమాయకులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించారు..డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు..!

Also read: DK Aruna on Harish Rao: అమాయకులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించారు..డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News