Fuel Crisis in North East: ఈశాన్య రాష్ట్రాల్లో చమురు కొరత.. కోటా విధింపు

Fuel Crisis in North East: వరదల్లో చిక్కుకుని అసోం అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా ఈశాన్య రాష్ట్రాల్లో చమురు కొరత తలెత్తింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు.

Written by - Attili | Edited by - Attili | Last Updated : May 29, 2022, 06:34 PM IST
  • అసోంలో కొనసాగుతున్న వరద బీభత్సం
  • ఈశాన్య రాష్ట్రాల్లో చమురు కొరత
  • పెట్రోల్,డీజిల్ అమ్మకాలపై కోటా విధింపు
Fuel Crisis in North East: ఈశాన్య రాష్ట్రాల్లో చమురు కొరత.. కోటా విధింపు

Fuel Crisis in North East: ద్విచక్ర వాహనదారులకు రోజుకు రెండు వందల రూపాయలకు మించి పెట్రోల్ విక్రయించరు. ఆటోలకు 300 వందల రూపాయలు డీజిల్ మాత్రమే పోస్తారు. ఇక కారు, లారీలు లాంటి నాలుగు చక్రాల వాహనాలకు రోజుకు వెయ్యి రూపాయల మించి పెట్రోల్ లేదా డీజిల్ ను విక్రయించకుండా ప్రభుత్వం కోటా విధించింది. ఇదేదో శ్రీలంకలోనో.. మరెక్కడి పరిస్థితితో అనుకుంటున్నారా..? కానే కాదు.. ఇదంతా మన దేశంలోనే . కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితి ఇది.

త్రిపుర, మిజోరం ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తుల విక్రయాలపై కోటా విధించాయి. దీనంతటి కారణం అసోంలో భారీ వర్షాలు, వరదలు.

గత కొన్ని రోజులుగా వరదల్లో చిక్కుకుని అసోం అస్తవ్యస్తంగా మారింది. 26 జిల్లాల్లో 6 లక్షల మందిపై వరదలు, వర్షాలు ప్రభావం చూపాయి. 33 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. వరద ప్రభావిత జిల్లాల్లో ఏర్పాటు చేసిన 89 సహాయక శిబిరాల్లో 50 వేల మందికి పైగా తలదాచుకుంటున్నారు. వరదలు, వర్షాలు, కొండచరియలు కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఊళ్లకు ఊళ్ల నీటమునిగాయి. జలదిగ్బంధనంలో వందలాది మంది చిక్కుకుని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. నదులు మహోగ్రంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

అసోంలోని దిమా అసావో జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆ రాష్ట్రంలోని బరాక్ లోయతో పాటు మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. ఈశాన్య సరిహద్దు రైల్వే శాఖ లమ్డింగ్-బదర్‌పూర్ మధ్య 50 రైళ్లను రద్దు చేసింది.

చాలా చోట్ల రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వీటిని పునరుద్దరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

 దాంతో ముందు జాగ్రత్త చర్యగా పలు ఈశాన్య రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై కోటా విధానాన్ని అమలులోకి తెచ్చారు. ప్రస్తుతానికి ఆహార కొరత, లేదనీ.. పెట్రో స్టాక్ కూడా తగినంత ఉందనీ..కానీ పరిస్థితి మరికొన్ని నెలలు ఇలాగే కొనసాగితే.. ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.

ఇక మూడు జిల్లాలతో కూడిన అసోంలోని బరాక్ లోయలో మూడు నెలలకు సరిపడ ఆహార పదార్థాలు, పది రోజులకు సరిపడ పెట్రో ఉత్పత్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అవి నిండుకునే లోపు రవాణా సౌకర్యాలు పూర్తిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.

వరదల వల్ల రైలు, రోడ్డు మార్గాలు మూసుకుపోవడంతో.. విమాన టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. పలు విమానయాన సంస్థలు .. టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. గౌహతితో పాటు కోల్‌కతాకు వెళ్లే విమానాల ఛార్జీలు పెంచేయడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. దాంతో టికెట్ ధరలు పెంచవద్దంటూ అధికారులు విమాలన యాన సంస్థలను ఆదేశించారు.

Also Read: Assam Floods: వరదలతో అసోం అతలాకుతలం.. నీట మునిగిన రైల్వే స్టేషన్, వీడియో వైరల్

Also Read: Thursday Tips: గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఈ పనులు చేయకూడదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News