Richest Village In Asia: ఎప్పుడైనా ఊరు అనగానే మట్టిరోడ్లు, చేతిపంపు, ఎద్దుల బండ్లు, మట్టి ఇల్లులు, కరెంటు కట్ ఇవన్నీ ఉంటాయనుకుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా అత్యంత ధనికులు ఉండే ఊరును ఎప్పుడైనా చూశారా? అవును ఈరోజు మనం చెప్పుకోబోయే ఊరు ఆసియాలోనే అత్యధిక ధనవంతులు ఉండే ఊరు. ఈ ఊరు ఏ దేశంలో ఉంటుంది? అనుకుంటున్నారా? మన దేశంలోనే.. గుజరాత్‌లోని మధురానగర్ భుజ్.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతాయనడానికి ఈ ఊరు కూడా ఓ నిదర్శనం. అందుకే ఇలాంటి అత్యధిక ధనవంతులు కలిగిన ఊరు ఏ చైనా, సౌత్ కొరియాలో కాకుండా మన దేశంలో ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామంగా పేరు పొందిన మాధాపూర్ గుజరాత్‌లోని భుజ్ శివారులో ఉంది. ఇక్కడి జనాభా 32 వేల మంది. వీరి ఫిక్సెడ్ డిపాజిట్ల విలువ రూ. 7000 కోట్లు అంటే నమ్ముతారా? ఇక్కడ ఎక్కువ శాతం మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు వీళ్లు ఇక్కడి స్థానిక బ్యాంకుల్లో ప్రతి ఏటా కొన్ని కోట్ల రూపాయలను జమా చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడి నివసించేవారు ఎక్కువశాతం మంది పటేల్ కమ్యూనిటీకి చెందినవారు.
ఇదీ చదవండి: ఈ జపనీస్ బామ్మకు 116 ఏళ్లు.. గిన్నీస్ వరల్డ్ రికార్డు ఆమె లైఫ్‌స్టైల్ ఎలా ఉండేదో తెలుసా?
ఈ మాధపుర్ గ్రామంలో దాదాపు 20 వేల ఇళ్లు ఉన్నాయి. వీరికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారు. అన్ని బ్యాంకులకు చెందిన బ్రాంచీలు కూడా వీరికి ఈ గ్రామంలో అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు కూడా ఈ గ్రామంలో తమ బ్రాంచీలను ఓపెన్ చేసేసాయి.
ఎక్కువ శాతం డిపాజిట్లు ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలకు సంబంధించినవారే చేస్తారు. ముఖ్యంగా వీరు ఆఫ్రికన్ దేశంలో స్థిరపడ్డారు. అక్కడి నిర్మాణరంగంలో బాగా రానిస్తున్నారు. మరికొంతమంది యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా౩,న్యూజిలాండ్ వంటి దేశాల్లో స్థిరపడ్డారు.కానీ, ఈ గ్రామానికి చెందిన ప్రతి ఒక్క ఎన్‌ఆర్‌ఐ వారున్న ప్రదేశంలో కాకుండా ఈ స్థానిక గ్రామంలోని బ్యాంకుల్లోనే పెట్టుబడులు పెడుతున్నారు.
ఇదీ చదవండి: యూపీఎస్‌సీ సీడీఎస్ 2 హాల్ టిక్కెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి..
అంతేకాదు ఈ గ్రామంలో నీటి కొరత లేదు, శానిటేషన్, రోడ్లు కూడా బాగున్నాయి. పబ్లిక్, ప్రైవేటు పాఠశాలలు, చెరువులు, దేవాలయాలతో పచ్చగా సుభిక్షంగా ఉంది. గుజరాత్ అంటే కేవలం భారతదేశంలోని ప్రధాన వ్యాపార కేంద్రాలలో ఒకటి మాత్రమే కాదు ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామాన్ని కూడా కలిగి ఉంది. దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు ఇక్కడికి చెందినవారే. ముఖ్యంగా ఈ అభివృద్ధి కేవలం నగరాలకే పరిమితం కాలేదు. ఇక్కడ ఈ చిన్న గ్రామం నేడు ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా గుర్తింపు పొందింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.