7th Pay Commission Latest News Today 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగా.. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, మరో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఇక వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని ఓటర్లను ఆకట్టుకునేంందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది మొదటి, రెండు డీఏలను 4 శాతం చొప్పున కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. ఇక ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
జనవరి 2024లో డీఏ పెంపు భారీగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటాను బట్టి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా ప్రస్తుత డీఏ 49 శాతానికి చేరుకుంది. AICPI ఇండెక్స్ తాజా గణాంకాలు 138.4 స్కోర్‌కు చేరుకున్నాయి. అంటే అక్టోబర్ నెల డేటా 0.9 పాయింట్లు పెరిగింది. నవంబర్, డిసెంబర్ డేటా ఇంకా రాలేదు. మరో రెండు నెలల AICPI ఇండెక్స్ పాయింట్లు ఇలానే పెరిగితే.. డీఏ పెంపు భారీగా ఉండే అవకాశం ఉంది.
ఏడాదికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతోంది. మొదటి డీఏ జనవరి 1 నుంచి అమలు చేస్తుండగా.. రెండో డీఏను జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో డీఏ 38 శాతం ఉండగా.. రెండుసార్లు పెంపుతో 46 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాది జనవరిలో కూడా డీఏ పెంపు 4 శాతం ఉంటే.. మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంటుంది. డీఏ 50 శాతం దాటితే.. మొత్తాన్ని బేసిక్‌కు యాడ్ చేసి మళ్లీ జీరో నుంచి డీఏను అమలు చేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడు 8వ వేతన సంఘం అమలు చేయాలి.
డీఏ పెంపు రేటు AICPI సూచికపై ఆధారపడి ఉంటుంది. ఇండెక్స్ డేటా వివిధ రంగాలకు సంబంధించిన ద్రవ్యోల్బణ డేటా వివరాలు ఉంటాయి. ఉద్యోగి జీతం ఎంత పెంచాలి..? అని ఈ డేటా ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే తుది నిర్ణయం మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది.
Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి