Covid-19: ఐఐటీ మద్రాస్‌లో కరోనా కలకలం.. మరో 18 మందికి పాజిటివ్... 30కి చేరిన కేసుల సంఖ్య!

IIT Madras Covid-19: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఐఐటీ మద్రాస్‌లో రెండ్రోజుల్లో 30 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 03:01 PM IST
Covid-19: ఐఐటీ మద్రాస్‌లో కరోనా కలకలం.. మరో 18 మందికి పాజిటివ్... 30కి చేరిన కేసుల సంఖ్య!

30 Covid-19 Positive Cases In IIT Madras: మద్రాస్‌ ఐఐటీలో కరోనా (Covid-19) కలకలం రేపుతోంది. గురువారం 12 మంది కరోనా బారినపడగా.... తాజాగా మరో 18 మందికి వైరస్ సోకింది. దాంతో అక్కడ (IIT Madras) కేసుల సంఖ్య 30కి చేరినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. నిన్న తమిళనాడులో 39 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు సంఖ్య పెంచాలని అక్కడి ప్రభుత్వం.. ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. దీనికి ఢిల్లీలో పెరుగుతున్న కేసులను ఉదహరించింది. 

దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటి పోలిస్తే...స్వల్పంగా పెరిగాయి. తాజాగా 2,451 మందికి కొవిడ్ పాజిటివ్ (Corona cases in India) ​నిర్ధారణ అయింది. వైరస్తో కొత్తగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,589 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 52వేల 481కి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేల 116గా ఉంది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.5 శాతానికి పైగా నమోదైంది. దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. గురువారం 18,03,558 మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,87,26,26,515కు చేరింది. 

Also Read: Delhi Covid Cases: ఢిల్లీలో కొత్త వేరియంట్ కలకలం... కేసుల పెరుగుదలకు అదే కారణమా...? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News