Unknown Facts About Milk: రోజూ పాలు తాగడం మంచిదేనా? ఇలా చేస్తే ఏమవుతుందటే..

Unknown Facts About Milk: ప్రతి రోజు పాలను తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు ఎముకలను ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 25, 2024, 03:37 PM IST
Unknown Facts About Milk: రోజూ పాలు తాగడం మంచిదేనా? ఇలా చేస్తే ఏమవుతుందటే..

Unknown Facts About Milk: ప్రస్తుతం చాలా మంది రోజూ ఉదయం లేవగానే బెడ్‌ కాఫీ తాగుతూ ఉంటారు. అంతేకాకుండా రోజులో రెండు నుంచి మూడు సార్లు కాఫీ తాగుతూ ఉంటారు. నిజానికి వీటిని రోజు తాగడం అంత మంచిది కాదు. వీటికి బదులుగా ప్రతి రోజు పాలు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి బోలెడు లాభాలను కలిగిస్తాయి. ముఖ్యంగా పాలలో ఉండే విటమిన్ డి పోషకాలు శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. పాలలో కాల్షియం అధిక ఉంటుంది. ఇది ఎముఖలతో పాటు దంతాలను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 

పాలు తాగడం వల్ల కలిగే 8 లాభాలు:
ఎముకలు బలపడటం: 

పాలలో కాల్షియం అధికంగా లభిస్తుంది. ప్రతి రోజు తాగడం వల్ల ఎముకలు కూడా సులభంగా దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా దంతాలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు ప్రతి రోజు గ్లాసు చొప్పున పాలను తాగించడం వల్ల శరీరం కూడా దృఢంగా తయారవుతుంది. దీంతో పాటు ఎముఖలు కూడా పెరుగుతాయి. 

ప్రోటీన్ మూలం: 
పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర పెరుగుదలకు, కణజాల మరమ్మత్తుకు అవసరమైన అనేక మూలకాలను అందించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాలు ప్రోటీన్‌ లోపం వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది..

విటమిన్లు, ఖనిజాలు: 
పాలలో విటమిన్ డి, బి12 పాటు అనేక విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి శరీర పెరుగుదలకు, రోగ నిరోధక శక్తికి ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు బాడీ పెరుగులకు కారణమయ్యే అనేక రకాల పోషకాలను అందిస్తుంది.

బరువు నియంత్రణ: 
పాలలో ఉండే మంచి కొలెస్ట్రాల్‌ శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి శరీర బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పాలు కడుపును ఎల్లప్పుడూ నిండుగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. 

Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌

నిద్రను పెంచుతుంది: 
పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్రను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు మానసిక ప్రశాంతతను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

రోగ నిరోధక శక్తి: 
పాలలో ఉండే యాంటీబాడీలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది ఇది అంటువ్యాధుల నుంచి విముక్తి కలిగిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News