Summer Food Tips: ఎండాకాలం.. ఎండలు మండే కాలం.. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఆహారంలో నియమాలు తీసుకోక తప్పని కాలం ఇదే. ఈ సమయంలో మనం అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మరి ముఖ్యంగా వేసవికాలంలో మసాలాలతో చేసిన ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. ఇవి తీసుకోవడం వల్ల కడుపులో మంట , ఎసిడిటీ లాంటివి సులభంగా వస్తాయి.
మామూలుగా ఆహారంలో రుచి ,రంగు రావడం కోసం పలు రకాల సుగంధ ద్రవ్యాలను వాడుతారు. వీటి వల్ల కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరీ ముఖ్యంగా వేసవికాలంలో మనం ఎదుర్కొనే వేడి సమస్యలు తగ్గించడానికి ఇది ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఈ వేడి వాతావరణం వల్ల పిల్లలలో ఆకలి సరిగ్గా ఉండదు.. ఈ కారణంగా వారు డిహైడ్రేషన్ కి గురి అవుతారు. ఇలాంటివి లేకుండా జీలకర్ర నానబెట్టిన నీళ్లు పిల్లలకి తాగించడం మంచిది.
వేసవికాలంలో తీసుకోకూడని ఆహార పదార్థాలు:
ఈ కాలం మనం వీలైనంతగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి అవేమిటో తెలుసుకుందాం..
కారం:
కూరల్లో రుచి కోసం వాడే కారం మరీ ఎక్కువగా ఉంటే కడుపు, ఛాతీలో మంట వస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది అల్సర్ గా మారే అవకాశం కూడా ఉంది. ఎండాకాలం వీలైనంతగా కారం తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
అల్లం:
మనలో చాలామంది అల్లం మంచి చేస్తుంది అనే ఆలోచనతో మజ్జిగ దగ్గర నుంచి అన్నిట్లో అల్లం దంచి కొడతాం. అయితే ఎండాకాలం పొరపాటున కూడా ఆ పని చేయకండి. అల్లం శరీరానికి వేడి కలిగిస్తుంది.. కాబట్టి ఎండాకాలం ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రతను పెరిగే అవకాశం ఉంది.
గరం మసాలా:
గరం మసాలాతో చేసిన ఆహార పదార్థాలు ఈ కాలం వీలైనంతగా తీసుకోకపోవడం మంచిది. దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి. అజీర్తి, వికారం లాంటి లక్షణాలు కలిగే అవకాశం ఉంది.
కూల్ డ్రింక్స్:
వేసవి తాపాన్ని తగ్గిస్తాయి కదా అని మార్కెట్లో లభ్యమయ్యే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం మనకు అలవాటు. అయితే ఇది మన తాపాన్ని తగ్గించదు సరి కదా ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తుంది. కాబట్టి ఇంట్లో చేసుకునే పండ్ల రసాలు తీసుకోవడం మంచిది.
Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook