Black Plum Jamun for Diabetic Patient: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది మధుమేహం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వీటిని విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల మధుమేహం బారిన పడుతున్నారు. అంతేకాకుండా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరగుతున్నాయి. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించి..నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
నేరేడు పండ్లను ఇలా తినండి:
నేరేడు పండ్లలో పీచు, ప్రొటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి6, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు లాభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ మధుమేహంతో బాధపడుతున్నవారు తినడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
1. నేరేడు పండ్ల సలాడ్:
ఫ్రూట్ సలాడ్ తినాలనుకునే వారు నేరేడు పండ్లతో తయారు చేసిన సలాడ్ తినండి. ఇలా ప్రతి రోజూ తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
2. నేరేడు పండ్ల ఫిజ్:
ఫిజ్ తయారు చేయడానికి ముందుగా... నిమ్మకాయ సోడాను గ్లాసులో పోసుకుని అందులో నేరేడు పండ్ల గుజ్జును వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇలా తయారు చేసిన ఫిజ్‌ను తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
3. నేరేడు పండ్ల హల్వా:
నేరేడు పండ్ల హల్వా తయారు చేయడానికి ముందుగా ఆ పండ్ల నుంచి గుజ్జును తీయాల్సి ఉటుంది. తీసి ఒక బౌల్ వేసి అందులో తేనె, చియా గింజలను మిక్స్ చేసి హల్వాను సిద్ధం చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న హల్వాను క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
4. నేరేడు పండ్ల రసం:
జామున్ రసం గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండు తీసివేసి, విత్తనాలను వేరు చేయాలి. గుజ్జును బ్లైడర్‌లో వేసి.. అందులో బ్లాక్ సాల్ట్, తేనె కలిపి జ్యూస్‌లా తయారు చేయాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని ప్రతి రోజూ తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Honey Rose Pics : బాప్ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ
Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook