Hormone Seeds: మనిషి శరీరంలో హార్మోన్స్ పాత్ర చాలా కీలకమైంది. ఆలోచన, పని, దినచర్య, స్వప్నించడం అంతా హార్మోన్స్ దే. అలాంటి హార్మోన్స్ సమతుల్యత కోసం ఏం చేయాలో తెలుసుకుందాం..
మనిషి దినచర్య, ఆలోచన, కలలు కనడం, నిర్దేశిత లక్ష్య సాధన అన్నింటిలోనూ కీలకమైన పాత్ర పోషించేది హార్మోన్లే. హార్మోన్స్ సమతుల్యత సరిగ్గా లేకపోతే మొత్తం పనితీరుపై ప్రభావం పడుతుంది. ఫలితంగా పీసీఓఎస్ వంటి పలు సమస్యలు ఎదురౌతాయి. అయితే హార్మోన్ల సమతుల్యతను పరిరక్షించేందుకు ప్రకృతిలో కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. కొన్ని రకాల విత్తనాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు..
దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో హార్మోన్స్ పాత్ర కీలకం. పడుకోవడం, తినడం, ఎప్పుడు ఏం చేయాలనే నిర్ణయం, ఆలోచించడం, మెదడు నుంచి లభించే అన్ని సంకేతాలకు కారణం హార్మోన్స్ కారణం. మానసిక చక్రాన్ని ప్రభావితం చేసేది హార్మోన్స్. అయితే ప్రస్తుతం చెడు ఆహారపు అలవాట్లు, పోషక పదార్ధాల కొరత, చెడు లైఫ్‌స్టైల్ కారణంగా హార్మోన్స్ ప్రభావితమౌతున్నాయి. హార్మోన్స్ సమతుల్యత చెడకుండా..ఆరోగ్యంగా ఉండేందుకు ఏ విధమైన డైట్ తీసుకోవాలో చూద్దాం..
సన్‌ఫ్లవర్ విత్తనాలు
సన్‌ఫ్లవర్ విత్తనాల్లో విటమిన్ ఇ,సెలేనియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ ప్రోజెస్టెరోన్ హార్మోన్‌ను అభివృద్ధి చేస్తాయి. సన్‌ఫ్లవర్ విత్తనాల్ని నానబెట్టి..ఇతర పండ్లతో తినాలి. లేదా సలాడ్ రూపంలో లేదా నేరుగా తినవచ్చు.
ఆనపకాయ విత్తనాలు
ఈ విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. ఆనపకాయ విత్తనాల్ని సలాడ్, స్మూదీలో కలుపుకుని తినవచ్చు. లేదా ఈ విత్తనాల్ని ఇతర పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు.
చియా సీడ్స్
ఈ విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ వల్ల నెలసరి ముందుగా కన్పించే లక్షణాల్నించి ఉపశమనం పొందవచ్చు. ఈ విత్తనాల్ని కనీసం రెండు గంటలు నానబెట్టి..కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగేయాలి. లేదా సలాడ్‌తో కలిపి తినవచ్చు.
ఫ్లక్స్ సీడ్స్
ఫ్లక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈస్ట్రోజన్ ఉత్పత్తిలో దోహదపడతాయి. పెరుగు, సలాడ్, స్మూదీ, మజ్దిగలో ప్రై చేసిన ఫ్లక్స్ సీడ్స్ కలిపి తీసుకోవచ్చు.
Also read: Healthy Heart: మీ డైట్లో ఈ పప్పులు చేర్చుకుంటే..గుండె పదికాలాలు పదిలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook