Fat Burning Drink: మీ ఒంట్లో కొవ్వు ఎక్కువగా పేరుకుందా? ఈ ఒక్క డ్రింక్‌ తాగండి చాలు..

Fat Burning Drink: చియా సీడ్స్ అనే పేరు చాల మంది ఈ మధ్య వింటున్నారు.  చాలా మందికి అసలు వీటి గురించి తెలియదు. వీటిని మనం నిత్యం వాడుకోవడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. సుఖ విరోచనం అవుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 5, 2024, 03:34 PM IST
Fat Burning Drink: మీ ఒంట్లో కొవ్వు ఎక్కువగా పేరుకుందా? ఈ ఒక్క డ్రింక్‌ తాగండి చాలు..

Fat Burning Drink: చియా సీడ్స్ అనే పేరు చాల మంది ఈ మధ్య వింటున్నారు.  చాలా మందికి అసలు వీటి గురించి తెలియదు. వీటిని మనం నిత్యం వాడుకోవడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. సుఖ విరోచనం అవుతుంది. శరీర బరువు కూడా బాగా తగ్గుతారు. బరువును పెంచకుండా చేయడానికి ,బ్లడ్లో కొలెస్ట్రాల్ చేరకుండా చేయడానికి హెల్తీగా ఉండటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి చీయా సీడ్స్. దీనివల్ల గుండె జబ్బులు రాకుండా నిరోధించడానికి , డయాబెటిస్ ఉన్నవారికి ఎక్కువగా ఇన్ల్ఫమేషన్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. బాడీ లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా చేయడానికి చీయా సీడ్స్ ఉపయోగపడుతున్నాయి. చీయా సీడ్స్ లో ఉండే పోషకాలు ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. వంద గ్రాముల చీయా సీడ్స్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

క్యాల్షియం 636 మిల్లీగ్రాములు అంటే పాల కంటే ఫైవ్ టైమ్స్ క్యాల్షియం లభిస్తుంది. 330 మిల్లీగ్రాముల మెగ్నీషియం ,ఫాస్పరస్ 450 మిల్లీగ్రాముల ఉంటుంది. మెదడు కణాల పనితీరును నియంత్రించడం జరుగుతుంది. పొటాషియం 400 మిల్లీగ్రాములు  ఉంటాయి. ఇవన్నీ పోషకాలు కలిగిన ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే బాడీ లో గుండె సంబంధమైన వ్యాధులు రావు. ఎందుకంటే చియా సీడ్స్ కొలెస్ట్రాల్ ను కట్ చేస్తుంది.

ఇదీ చదవండి: మష్రూమ్స్‌తో 6 ఆరోగ్య ప్రయోజనాలు.. బీపీ, అల్జీమర్స్‌ కూడా మీ దరిచేరవు..

ఆరోగ్య సమస్యలు రాకుండా నిరోధించే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ చీయా సీడ్స్‌లో ఉన్నాయి. ఈ చియా సీడ్స్ లో ముఖ్యంగా 34 గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి. మీరు ఇతర ఆహారాలతో కలిపి తిన్నప్పుడు ఆహారంలో ఉండే కొవ్వు లాంటివి ఆహారంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ వంటివి చేరకుండా కాపాడతాయి. ఇందులో ఉండే పీచు బాగా ఉపయోగపడతాయి ఉంటుంది. మనం తీసుకునే ఆహార పదార్ధాలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. చీయా సీడ్స్ పిండి పదార్ధాలు లోపలికి వెళ్లకుండా పిండిపదార్ధాలు చక్కెరగా మారి రక్తంలో చక్కెర పెరగనివ్వకుండా చేస్తుంది.

ఇదీ చదవండి:  భగభగమంటున్న భానుడు.. సన్‌ స్ట్రోక్‌ వచ్చిన వెంటనే ఆ వ్యక్తికి ఇలా చేయండి..

చీయాసీడ్స్‌ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇన్సులిన్ నిరోధకత రక్తంలో చక్కెరను నియంత్రించే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ముఖ్యంగా చీయాసీడ్స్ డయాబెటిస్‌ ఉన్నవారికి తరచూ గాయాలు మానవు. దెబ్బలు గాయాలు మానకుండా పోతాయి. అలాంటి వారికి ఇన్ల్ఫమేషన్‌ తగ్గించడానికి కూడా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతాయి. 2007వ సంవత్సరంలో టొరంటోలో ఈ పరిశోధనలో చేసిన సైంటిస్టులు ఈ విషయం చెప్పారు. 

 చీయా సీడ్స్‌ తీసుకునే విధానం..
అయితే, చీయా సీడ్స్‌ మన ఆహారంలో చేర్చుకుంటే వాటిని ఓ ఆరు గంటలపాటు మందుగానే నానబెట్టుకుని తీసుకోవాలి. ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇలా ముందుగానే నానబెట్టి తీసుకోవాలి. అలాగే టైం లేనప్పుడు ఎప్పుడైనా ఒక గంట రెండు గంటలు నీళ్లలో నానబెట్టి వాటిని తీసేసి మీరు తినే సలాడ్‌లో వేసుకుని తీసుకోండి. వేడి వేడి సూప్ తో తీసుకుంటే బాగుంటుంది. లేదా డ్రెస్సింగ్ మాదిరి వేసుకుని కూడా తీసుకోవచ్చు. రెండు స్పూన్లు నీళ్లు వేసి నానబెట్టి దానికి తేనె నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News