Drinking Water Tips: మానవ శరీరంలో మూడు వంతుల భాగం నీటితోనే నిర్మితమైంది. అందుకే మనిషి శరీరంలో నీటి అవసరం చాలా ఎక్కువ. తగిన మోతాదులో నీళ్లు లేకపోతే డీ హైడ్రేషన్ వంటి సమస్య వెంటాడుతుంది. డీ హైడ్రేషన్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు చాలా ఉత్పన్నమౌతుంటాయి.
మనిషి శరీరానికి అసలు నీరు ఎందుకు అవసరమనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సమాధానం ఒకటే కన్పిస్తుంది. మానవ శరీరంలో మూడు వంతులు ఉండేది నీళ్లే. అందుకే నీటి అవసరం చాలా ఎక్కువ. అయితే రోజుకు ఎంత పరిమాణంలో నీళ్లు తాగాలి, రాత్రి సమయంలో తాగవచ్చా లేదా అనే సందేహాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ముఖ్యంగా నీళ్లు రోజుకు ఎంత తాగాలనేది తప్పకుండా తెలుసుకోవాలి. రోజూ సరిపడినంత నీళ్లు తాగకపోతే డీ హైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అది కాస్తా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ఆరోగ్యవంతమైన మనిషి రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి రాత్రి వేళ నీళ్లు తాగవచ్చా లేదా, తాగితే ఎంత తాగాలనే వివరాలు ఇప్పుడు.
ఆరోగ్య నిపుణుల ప్రకార రాత్రి వేళ పడుకునే ముందు నీళ్లు తాగడం చాలా అవసరం. రాత్రి పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల తిండి సులభంగా జీర్ణమౌతుంది. అంతేకాకుండా నీళ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరంలో కలుస్తాయి. నీళ్లు తగిన పరిమాణంలో తాగడం వల్ల మెటబోలిడం వేగవంతమౌతుంది. శరీరంలోని వ్యర్ధాలు, విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి.
కొంతమందికి నీళ్లు తక్కువగా తాగే అలవాటుంటుంది. మరి కొంతమంది యూరినేషన్ వంకతో తక్కువ తాగుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. డీటాక్సికేట్ కాకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అందుకే ప్రతిరోజూ తగిన పరిమాణంలో నీళ్లు తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి కాస్సేపు ముందు నీళ్లు తాగాలి. నిద్రపోయేటప్పుడు కాకుండా..నిద్రపోవడానికి కాస్సేపు ముందు తాగితే మంచిది.
డయాబెటిస్ , గుండె వ్యాధి రోగులు రాత్రి వేళ ఎక్కువ నీళ్లు తాగకూడదు. రాత్రి వేళ ఎక్కువ నీళ్లు తాగితే పదే పదే యూరినేషన్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా నిద్ర పాడవుతుంది. ప్రతి మనిషికి సంపూర్ణమైన నిద్ర రోజుకు 8 గంటలు తప్పనిసరిగా కావల్సి ఉంటుంది.
రాత్రి వేళ నీళ్లు తాగేకంటే నిమ్మరసం, గ్రీన్ టీ, హెర్బల్ టీ లేదా ఇతర హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే మంచిది. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగితే తరచూ టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. నిద్ర చెడి..మళ్లీ నిద్ర పట్టే అవకాశాలుండవు. అందుకే రాత్రి నిద్రించడానికి కాస్సేపు ముందు 2 గ్లాసుల నీళ్లు తాగితే చాలు. ఆరోగ్యానికి చాలా మంచిది.
రాత్రి భోజనం అనంతరం శరీరాన్ని సహజసిద్ధ పద్ధతిలో క్లీన్ చేయాలంటే నీళ్లు తగిన పరిమాణంలో తీసుకోవాలి. దీనివల్ల విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యతో బాధపడేవారు రాత్రి తప్పకుండా నీళ్లు తాగాలి. జలుబు వంటి సమస్యల్లో కూడా నీళ్లే తగిన పరిష్కారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook