Diabetes: ఆ ఐదు ద్రవ పదార్ధాలు తీసుకుంటే..డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే

Diabetes: ఆధునిక జీవనశైలి తీసుకొచ్చిన ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ఎంత ప్రమాదకరమో..అలవాట్లతో అంతగా నియంత్రించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఐదు రకాల ద్రవ పదార్ధాలతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే అంటున్నారు. అవేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2022, 03:15 PM IST
 Diabetes: ఆ ఐదు ద్రవ పదార్ధాలు తీసుకుంటే..డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే

Diabetes: ఆధునిక జీవనశైలి తీసుకొచ్చిన ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ఎంత ప్రమాదకరమో..అలవాట్లతో అంతగా నియంత్రించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఐదు రకాల ద్రవ పదార్ధాలతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే అంటున్నారు. అవేంటో చూద్దాం.

డయాబెటిస్ అనేది స్లో పాయిజన్ లాంటిది. మనిషిని నిలువునా కూల్చేస్తుంది. ఎంత ప్రమాదకర వ్యాధో..అప్రమత్తంగా ఉంటే అంతగా నియంత్రించవచ్చు. పూర్తిగా నయం చేయలేం కానీ అదుపులో ఉంచుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే..డయాబెటిస్ ఉన్నవాళ్లకు..గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువే. అంతేకాదు..మధుమేహం కారణంగా మూత్రపిండాల సమస్య ఎదురవుతుంది. అందుకే ఆహారపు అలవాట్లలో మార్పులు, కొన్ని రకాల ద్రవ పదార్ధాలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.

డయాబెటిస్ రోగులకు గ్రీన్ టీ ఓ దివ్యౌషధం. ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉండటంతో శరీరానికి మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి. గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వారికి చాలా మంచిది. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇక రెండవది కాకరకాయ జ్యూస్. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే..డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కడుపుకు సంబంధించిన వ్యాధులు కూడా దూరమౌతాయి. 

ఇక మూడవది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించే బీట్‌రూట్ జ్యూస్. శరీరంలో రక్త హీనతను కూడా దూరం చేస్తుంది. చలికాలంలో తీసుకోవడం వల్ల వెచ్చగా ఉంటుంది. నాలుగవది కొబ్బరి నీళ్లు. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, ఎమైనో యాసిడ్స్ కారణంగా అలసట ఉండదు. కొబ్బరి నీరు శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇక చివరిది కీరా జ్యూస్. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, బీ1, ఎమైనో యాసిడ్స్ కారణంగా శరీరంలో హార్మోన్స్ విడుదల బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

Also read: Tears of Happiness: ఆనంద భాష్పాల వెనక సైంటిఫిక్ కారణాలేంటో తెలుసా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x