Cherry Fruit Benefits: చెర్రీ పండ్లలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చెర్రీ పండులో పొటాషియం ఉంటుంది. అంతేకాదు విటమిన్ సి కూడా ఉండటం వల్ల ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి, ఇవి డ్రై రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రోజు చెర్రీ పనులతో మన శరీరానికి ఐదు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
చెర్రీ పండులో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చెర్రీ పండ్లు రక్తపోటు సడన్‌గా పెరగకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది, ఇది సోడియం శాతాన్ని తగ్గించేస్తుంది. గుండె సమస్యలతో బాధపడకుండా ఉండాలంటే చెర్రీ పండ్లను మీ డైట్ లో చేర్చుకోండి.
ఈ కాలంలో యూరిక్ యాసిడ్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ఇది కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తుంది. అంతేకాదు ఇది కీళ్ల నొప్పులకు కూడా దారితీస్తుంది. ప్యూరీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. హై బీపీ తో బాధపడుతారు. అయితే చెర్రీ పండ్లను డైట్లో చేర్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యను సమర్థవంతంగా తగ్గించేస్తుంది. జాయింట్ పెయిన్ సమస్యలు ఉండవు. చెర్రీ పండ్లను సులభంగా మన డైట్ లో చేర్చుకోవచ్చు. వీటిని నేరుగా తినవచ్చు స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు జ్యూస్‌లా కూడా చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: బయోటిన్ పుష్కలంగా ఉండే ఈ 5 ఆహారాలు తింటే జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది..
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు చెర్రీ పనులను వాళ్ళ డైట్లో చేర్చుకోవాలి. తరచు చెర్రీ పనులను తీసుకోవడం వల్ల నిద్ర సైకిల్ బ్రేక్ పడదు... ముఖ్యంగా వర్క్ ఇతర స్ట్రెస్ ల వల్ల నిద్రలేమిటో ఈ కాలంలో చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారు రెగ్యులర్‌గా చెర్రీ పండు జ్యూస్ తీసుకోవడం వల్ల త్వరగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కండరాల నొప్పితో బాధపడుతున్న వారు కూడా చెర్రీ పండ్లను డైట్లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులను త్వరగా తగ్గించేస్తాయి. చెర్రీ పండ్లతో త్వరగా ఎముక నొప్పి నుంచి కూడా బయటపడతారు. చెర్రీ పండ్లను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆక్సిడేటీవ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి.
త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా మీ దరి చేరవు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది చెర్రీ పండ్లలో పోలిఫైనల్స్ ఉంటాయి ఇవి సెల్ డామేజ్ కాకుండా కాపాడుతాయి. సాధారణంగా చెర్రీ పండ్లను మనం నేరుగా తినవచ్చు లేదంటే చాక్లెట్ చిప్స్ వేసుకొని డ్రై రూపంలో కూడా తీసుకోవచ్చు. సలాడ్ రూపంలో కూడా చెర్రీస్ తీసుకుంటారు.
ఇదీ చదవండి: అమ్ముల పొదిలో మరో అస్త్రం.. హైపర్ సోనిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం..!
ఏదైనా అతిగా తింటే విషమే అలాగే చెర్రీ పండ్లను కూడా అతిగా తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇవి అతిగా తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి, డయేరియాకు దారితీస్తుంది. కొంతమందికి అలర్జీ సమస్యలు వస్తాయి. అయితే ఈ చెర్రీ పండ్లను మీ డైట్ లో చేర్చుకునే ముందు మోతాదుకు వైద్యులను సంప్రదించండి. అయితే సాధారణంగా పెద్దలు ఒక 25 చెర్రీ పండ్లను ఒక రోజుకు తీసుకోవచ్చు పిల్లలకైతే 20 చెర్రీ పనులను పెట్టవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter