Best Plan for Weight Loss: బరువు పెరగడం ఆరోగ్యానికి చాలా హానికరం. బరువు పెరగడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం మహిళలతో పోలిస్తే పురుషులే అధిక బరువు పెరుగుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కాకుండా దీని కారణంగా పురుషులే తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని నివేదికలు తెలపడం విశేషం. బరువు పెరగడం వల్ల కూర్చోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వీలైనంత బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామందిలో ప్రస్తుతం బరువు పెరగడంతో పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తున్నాయి. దీనివల్ల గుండె సమస్యలకు దారితీస్తోంది. అయితే బరువు తగ్గడానికి చాలామంది గంటల తరబడి కఠిన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరు బరువు తగ్గరు. కారణాలు చాలా అయినాప్పటికీ బరువు తగ్గడంలో పాటించే నియమాలు తప్పుగా పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు.
బరువు తగ్గాలనుకుంటే ఇలా చేయండి:
ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది:
బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోడ్ సైడ్ దొరికే ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కేవలం వీరు పోషకాలు ఉన్న ఆహారాలనే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే ఫలితాలు పొందలేకపోవచ్చు. కాబట్టి ఆహారాలు తీసుకునే ముందు బరువు తగ్గడం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
వ్యాయామాలు తప్పనిసరి:
బరువు తగ్గాలి అనుకునేవారు ప్రతిరోజు వ్యాయామాలు చేయడం తప్పనిసరి చేసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు.. శరీరం దృఢంగా తయారవుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వ్యాయామాలు ప్రతి రోజు 45 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గడం అనేది పై రెండు నియమాలపై ఆధారపడి ఉంటుంది. బరువు తప్పనిసరిగా తగ్గాలనుకుంటే ఈ రెండు నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారాన్ని స్వీకరించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook