Belly Fat Loss In 7 Days: జీవనశైలిలో మార్పుల కారణంగా చాలామంది ఆయిల్ ఫుడ్స్ ను విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ పేరుకుపోతోంది. అంతేకాకుండా చాలామంది బరువు కూడా పెరుగుతున్నారు. అయితే పొట్ట చుట్టూ కొలెస్ట్రాలను తగ్గించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే దీనికోసం కొన్ని నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు సూచిస్తున్నారు. నిపుణులు సూచించిన నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యంగా పొట్ట చుట్టూ కొలెస్ట్రాలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి నియమాలు పాటించడం వల్ల త్వరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది:
చక్కెరకు దూరంగా ఉండండి:
చాలామంది బరువు తగ్గే క్రమంలో చక్కెరను విచ్చలవిడిగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా టీలు రోజుకు మూడు నుంచి నాలుగు తీసుకుంటారు. అయితే ఇలా చేయడం బరువు పెరగడమే కాకుండా మధుమేహం సమస్యలు బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చక్కెరను అస్సలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉండాలి:
బరువు తగ్గాలనుకునేవారు ఉదయం తీసుకునే అల్పాహారంలో ప్రోటీన్స్ పరిమాణం అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం లో కూడా ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభించే ఆహారాలను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే సులభంగా బరువు తగ్గుతారని.. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాట్ ఉండే ఫుడ్‌ను దూరం పెట్టండి:
కల్తీ నూనెలో కొవ్వుల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నూనెలను అతిగా తీసుకోవడం వల్ల విపరీతమైన బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బరువు సులభంగా తగ్గాలనుకునేవారు.. పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ చెక్ పెట్టాలనుకునేవారు ఈ కల్తీ నూనెలతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
వ్యాయామాలు చేయాలి:
బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా శరీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం కావడమే కాకుండా.. శరీరం దృఢంగా తయారవుతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకునేవారు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి