Pistachios Health Benefits: ఆరోగ్యకరమైన ప్రయోజనాల కోసం ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. దీని వల్ల మనం అనేక గింజలు మన డైట్ లో చేర్చుకుంటాం. ప్రత్యేకంగా మనం బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ వంటివి డైట్లో చేర్చుకుంటాం. అయితే ఈరోజు పిస్తాలు తీసుకోవడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రతిరోజు ఒక 12 పిస్తాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
పిస్తాలు రుచికరంగా ఉండడమే కాకుండా అవి స్నాక్ ఐటమ్ లో తీసుకోవచ్చు. పోషకాలకు పవర్ హౌస్ పిస్తాలు. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ప్రతిరోజు 12 పిస్తాలు తీసుకోవడం వల్ల మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే పిస్తాలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ b6 కూడా ఉంటుంది. ఇది బ్రెయిన్ పనితీరుకు తోడ్పడుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపడేలా చేస్తుంది. పిస్తాల్లో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ మన శరీర పని తీరుకు ప్రోత్సహిస్తాయి.
గుండె ఆరోగ్యం..
పిస్తాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీ అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో కార్డియో సంబంధిత వ్యాధులు మీ దరిచేరకుండా ఉంటాయి.
బరువునిర్వహణ..
పిస్తాలో క్యాలరీల మోతాదు తక్కువగా ఉంటుంది. వీటిని మీ డైట్ లో చేర్చుకుంటే వారికి ఎంతో ఆరోగ్యకరం ఇందులో ప్రోటీన్, ఫైబర్, పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తాయి. కాబట్టి ఎక్కువ తినకుండా ఉంటారు. దీంతో బరువు పెరగరు క్యాలరీలు తక్కువగా తీసుకుంటారు.
షుగర్ కంట్రోల్
పిస్తాలు తీసుకోవడం వల్ల ఇందులో గ్లైసామిక్ సూచి తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెరను హఠాత్తుగా పెరగనివ్వవు. డయాబెటిస్ తో బాధపడేవారు పిస్తాలు స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరగవు.
కంటి ఆరోగ్యం...
పిస్తాలో లూటీన్, జియాన్తీన్, యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో అవశ్యకం. పిస్తాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటిని హానికర బ్లూ లైట్స్ నుంచి కాపాడతాయి. అంతేకాదు వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలకు కూడా చెక్ పెడతాయి.
ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..
జీర్ణ ఆరోగ్యం..
పిస్తాల్లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగు చేస్తుంది. వీటిని డైట్ లో చేర్చుకుంటే కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. పేగు ఆరోగ్యకరమైన పని తీరుకు ప్రోత్సహించి, మలబద్ధకం సమస్య దరిచేరకుండా చేస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..
పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంట సమస్యను తగ్గిస్తుంది అంతేకాదు ప్రాణాంతక వ్యాధులను దరిచేరకుండా ఆర్థరైటిస్ గుండె సమస్యల నుంచి కాపాడతాయి.
ఇదీ చదవండి: బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?
మెదడు ఆరోగ్యం..
పిస్తాలు డైట్ లో ఉండటం వల్ల ఇందులో ఉండే విటమిన్ b6 యాంటీ ఆక్సిడెంట్ మెరుగైన బ్రెయిన్ పని తీరుకు సహాయపడతాయి. ప్రతిరోజు మీ డైట్ లో పిస్తాలు ఉండటం వల్ల వయసు రీత్యా వచ్చే మెదడు సమస్యలకు చెక్ పెడతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter