Honey or Jaggery which is best for diabetic patients: డయాబెటిస్ అంటే భయపడాల్సినంత పెద్ద వ్యాధి ఏమీ కాదు.. కాకపోతే ఆహార నియమాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎదురయ్యే ఇబ్బందులే చాలా అధికంగా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉన్నంతవరకు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ ముందుగా చెప్పుకున్నట్టుగా ఒంట్లో షుగర్ ఎక్కువైనప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని తట్టుకోవడమే కష్టం. అందువల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటిగా నిలిచింది.
క్రమశిక్షణ లేని లైఫ్ స్టైల్, హానికరమైన ఆహారం, శరీరంలో ఇన్సులిన్ తక్కువ అవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి డయాబెటిస్ కి దారి తీస్తుంది. మధుమేహంతో వచ్చే మరో సమస్య ఏంటంటే.. మధుమేహంతో బాధపడే వారికి ఇతర వ్యాధులు సోకినప్పుడు కలిగే అవస్థ కూడా తీవ్రంగానే ఉంటుంది. ఈ కారణంగానే డయాబెటిస్‌ని కొంతమంది స్లో పాయిజన్ తో లేక స్లో డెత్ తో పోల్చుతుంటారు.
గతంలో మధుమేహం అనేది 40 నుంచి 45 ఏళ్ల పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇటీవల కాలంలో యువత కూడా డయాబెటిస్ బారిన పడుతుండటం సర్వసాధారణమైంది. ఇదే చాలామందిలో ఆందోళన కలిగిస్తోంది. డయాబెటిస్ సోకిన వారు మెడిసిన్ మాత్రమే కాదు.. ఆహార నియమాలు కూడా వైద్యుల సలహా మేరకే అనుసరిస్తూ ఉండాలి. లేదంటే శరీరంలో షుగర్ లెవెల్స్ అటుఇటై మళ్లీ ఇబ్బందులు తప్పవు. తీపి పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి.
చక్కరకు మన ముందున్న ప్రత్యామ్నాయాలు:
డయాబెటిస్ సోకిన వారు తీపి పదార్థాలను దూరం పెట్టాలి కనుక తీపికరమైనవి తీసుకునే సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ పంచదారను ఉపయోగించరాదు. ఎందుకంటే పంచదారతో శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు చక్కరకు బదులుగా ఉన్న ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టయితే.. బెల్లం, తేనె బెస్ట్ ఆప్షన్స్ గా భావిస్తుంటారు. మీ ఆహార పదార్థాలలో వీటిని ఉపయోగించడం వల్ల అవి తీపిగా మారడంతో పాటు శరీరానికి హాని కలిగించకుండా ఉంటాయి.
బెల్లం ప్రయోజనాలు..
తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తేనెను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉండటంతో పాటు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ డయాబెటిస్ వల్ల ఎదురయ్యే సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
తేనె ప్రయోజనాలు..
డయాబెటిస్ సోకిన వారు సాధ్యమైనంత వరకు తీపికి దూరంగా ఉండాల్సిందే. ఒకవేళ తీపి పదార్థాలు తీసుకోవాల్సి వచ్చినా.. పంచదార స్థానంలో బెల్లం ఉపయోగించడం మంచిది అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు. ఎందుకంటే బెల్లంలో పొటాషియం, మెగ్నీషియంతో పాటు B1, B6, C విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.
బెల్లం, తేనె.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ?
డయాబెటిస్ సోకిన వారిలో చాలామందిని వేధించే ప్రశ్న షుగర్‌కి బదులుదా బెల్లం తీసుకుంటే మంచిదా లేక తేనే తింటే మంచిదా అని. సాధారణంగా మధుమేహంతో బాధపడే వారు చక్కర కంటే బెల్లం కానీ లేదా తేనే కానీ ఉపయోగించవచ్చు అని చెబుతున్నప్పటికీ.. బెల్లం కూడా చక్కర తరహాలోనే చెరుకు నుండి తయారయ్యే పదార్థం కనుక.. బెల్లానికి బదులుగా తేనె తీసుకోవడమే ఉత్తమం అని ఈ రెండింటి మధ్య తేడా గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు. ఎందుకంటే బెల్లం తీసుకోవడం వల్ల కూడా ఎంతోకొంత మోతాదులో గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగే ప్రమాదం ఉంటుందేమో కానీ సహజంగా వచ్చే తేనేలో అలాంటి ప్రమాదం ఉండదంటున్నారు.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు హోమ్ రెమెడిస్, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఎవరి ఆరోగ్య సమస్య విషయంలో వారికి వేర్వేరు కారణాలు ఉంటుంటాయి కనుక ఈ సమాచారాన్ని పరిష్కారంగా భావించడానికి ముందుగా తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని ZEE NEWS ధృవీకరించడం లేదనే విషయాన్ని గ్రహించాల్సిందిగా మనవి.)