Weight Loss And Diabetes Control: భారతీయులు మెంతులను అధికంగా వంటల్లో వినియోగిస్తారు. వీటితో తయారుచేసిన పిండి కూరగాయ వంటకాలలో వాడితే ఆహారం రుచిగా మారుతుంది. అయితే వీటివల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇవి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. అయితే ఈ మెంతి గింజలే కాకుండా.. మెంతి ఆకులు కూడా శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే వీటిని భారతీయుల ఆహారంలో వినియోగిస్తారు. అయితే మెంతి గింజలను నీటిలో నానబెట్టుకొని ఆ నీరును తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వాటి వల్ల వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. శరీర బరువును తగ్గించడానికి..
మెంతి గింజలు నానబెట్టిన నీటిని రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చు. మెంతుల్లో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి సులభంగా శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిలో క్యాలరీలు అధిక పరిమాణంలో ఉంటాయి. దీంతో జీర్ణక్రయ కూడా మెరుగుపడుతుంది.
2. మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
మెంతి గింజల్లో మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ చర్యలను ప్రభావితం చేసి రక్తంలోని చక్కెర పరిమాణాన్ని తగ్గించి డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు మెంతి గింజలను నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
3. నొప్పులను తగ్గిస్తుంది:
మెంతి గింజల్లో నొప్పులను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది శరీర నొప్పులను దూరం చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా తిమ్మిర్లు రాకుండా కూడా చేస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా మెంతులను ఆహారంలో తీసుకోవాలి.
4. జీర్ణక్రియను మెరుగుపరుచుతాయి:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు మెంతి గింజలను వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తీసుకుని ఆహారంలో భాగంగా వినియోగిస్తే జీర్ణక్రియ సమస్యలు, పొట్ట సమస్యలైన యాసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికోసం ఒక టీ స్పూన్ మెంతి గింజలు తీసుకొని నీటిలో నానబెట్టుకొని ఆ నీటిని ఆహారం తీసుకునే ముందు తాగితే పై సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు.
5. చర్మ సమస్యలకు చెక్:
నీటిలో నానబెట్టిన మెంతి గింజలను మొలకెత్తిన తర్వాత.. శనగపిండితో కలిపి మిశ్రమంలో తయారు చేసుకొని మాస్క్ లా వినియోగిస్తే చర్మ సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా చర్మం నిగనిగాడుతూ మెరుస్తుంది. అయితే ఇదే మిశ్రమంలో తేనెను జోడించి ముఖానికి అప్లై చేస్తే ముఖం సౌందర్యవంతంగా మారుతుంది. కాబట్టి చర్మ సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే సులభంగా చర్మ సమస్యలు దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Rashmika School Girl: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook