తమిళ నటుడు శివకార్తికేయన్, నయనతార జంటగా తెరకెక్కిన 'Mr. లోకల్' సినిమా ట్రైలర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ నేపథ్యంతో ఎమ్. రాజేశ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ క్రీడలపై ఆసక్తి ఉన్న మనోహర్ అనే ఓ యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. కీర్తన వాసుదేవన్ అనే బిజినెస్ ఉమన్ పాత్రలో నయనతార కనిపించనుంది. తన వ్యాపారమే తప్ప మరొకటి పట్టని సీరియస్ లేడీ పాత్రలో నయనతార నటించగా.. ఆమెను తన ప్రేమలో పడేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసే పాత్రలో శివకార్తికేయన్ కనిపించనున్నాడని ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది.
స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్హప్ తమిజ్ సంగీతం అందించారు. కడుపుబ్బా నవ్వించే కామెడి పుష్కలంగా ఉందనిపిస్తున్న ఈ సినిమాలో యోగిబాబు, నారాయణ్ లక్కీ, రాధికా శరత్ కుమార్, సతీష్, ఆర్జే బాలాజీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కార్తికేయన్, నయన్ కాంబినేషన్లో వస్తోన్న రెండో చిత్రమిది. వీళ్లిద్దరి కాంబోలో గతంలోనే వచ్చిన 'వెలైక్కారన్' అనే సినిమా ఆడియెన్స్‌ని బాగానే ఎంటర్టైన్ చేసింది.