Immune Boost Fruits in Rainy Season: వాతావరణంగా మార్పులు జరగడం కారణంగా ఇన్‌ఫెక్షన్స్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జలుబు, దగ్గు, ముక్కు కారటం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఇలా సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు బారిన పడేవారు తప్పకుండా విటమిన్స్ అధిక పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి లోపం సమస్యలు రావడానికి కారణాలేంటో..ఈ సమస్య వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో మనం ఇప్పడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెరగడానికి ఈ విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి:
విటమిన్ C:
విటమిన్ సి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక లోపం సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జలుబు, దగ్గు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి విటమిన్ సి లభించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి ఉన్న ఆహారాలు:
✺ ఆరెంజ్
✺ టొమాటో
✺ పైనాపిల్
✺ జామ
✺ బొప్పాయి
Also Read: Cholesterol Signs: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కవైతే ఈ మూడు భాగాల్లో తీవ్రమైన నొప్పి
✺ కివి
✺ నిమ్మకాయ
✺ బ్రోకలీ
✺ ఉసిరికాయ
✺ బంగాళాదుంప
విటమిన్ డి:
ప్రస్తుతం చాలా మందిలో శరీరంలో విటమిన్ డి లోపం వల్లే రోగనిరోధక శక్తి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా అనేక రకాల ఇన్ఫెక్షన్ల, వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీంలో రోగనిరోధక శక్తి పెరడానికి విటమిన్ డి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీరంలో విటమిన్స్ లోపం తగ్గడానికి ప్రతి రోజు ఈ కింది ఆహాకాలు తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ డి ఆహారాలు ఇవే:
✺ గుడ్డు
✺ ఆవు పాలు
✺ చేప
✺ పుట్టగొడుగు
✺ నారింజ రసం
✺ ధాన్యపు
✺ కాడ్ లివర్ ఆయిల్.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Diabetes Diet: మధుమేహం తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడే పదార్ధమిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి