Medico Suicide: నా చావుకు నేనే కారణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న మెడికో ఆత్మహత్య

Medical Student Suicide Note Gests Tears: డాక్టర్‌ విద్య చదవలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుది పరీక్షల భయంతో ఒత్తిడికి గురయి ఆ విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదం నింపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 28, 2024, 02:37 PM IST
Medico Suicide: నా చావుకు నేనే కారణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న మెడికో ఆత్మహత్య

Anantapur Medical College: వైద్య వృత్తి అంటే సాధారణమైనది కాదు. వైద్యుడిగా రాణించాలంటే ఎన్నో పుస్తకాలు.. ఎన్నో ప్రయోగాలు చేయాల్సి ఉంది. అలాంటి చదువు ఒత్తిడిని తట్టుకుని నెగ్గడం చాలా కష్టం. అలాంటి వైద్య విద్యను అభ్యసించలేక ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు కారణం ఎవరూ కాదని.. తన చావుకు తానే కారణమని చెబుతూ ఆత్మహత్యకు ముందు లేఖ రాసి చనిపోయాడు. అతడి లేఖ చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఇది చదవండి: Venom Lizards: పాముల కన్నా అత్యంత విషపూరిత బల్లులు.. ఎరుపు రంగులో ఎప్పుడైనా చూశారా?

 

అనంతపురం జిల్లా ఉరవకొండలోని షిర్డీ సాయి నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు గిద్దలూరు శివప్రసాద్- శారద కుమారుడు రోహిత్. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతూ అదే కళాశాలలోని వసతి గృహంలో నివసించేవాడు. వైద్య విద్య పరీక్షల విషయంలో తరచూ ఒత్తిడికి గురవుతుండేవాడు. ఈ విషయాన్ని తన స్నేహితులతో నిత్యం పంచుకునేవాడు.

ఇది చదవండి: New Bride: 'అందంగా లేదు.. లావుగా ఉంది' అని అవమానించడంతో ఆర్మీ జవాన్‌ భార్య ఆత్మహత్య

 

వైద్య విద్య ఒత్తిడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కౌన్సిలింగ్‌ ఇప్పించారు. తర్వాత కోలుకున్నా కూడా చదువుపై దృష్టి సారించలేకపోయాడు. డిసెంబర్‌లో తుది పరీక్షలు ఉండడంతో భయాందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం తండ్రికి ఫోన్ చేసి 'ఇంటికి వస్తున్నా' అని చెప్పాడు. ఎంతకీ ఇంటికి రాలేకపోవడంతో తండ్రి రోహిత్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. భయంతో రోహిత్‌ స్నేహితులకు ఫోన్‌ చేయగా.. గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పడంతో బోరున విలపించాడు. విద్యార్థులు హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోహిత్ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవారం సాయంత్రమే గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెప్పారు.

నేనే కారణం..
రంగంలోకి దిగిన పోలీసులు వైద్య కళాశాల అధికారులు, హాస్టల్ అధికారులను విచారించారు. మృతుడి గదిలో ఒక సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. 'నా చావుకు నేను కారణం' అంటూ ఆంగ్లంలో రాసి బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలుస్తోది. 'పరీక్షల ఒత్తిడిని భరించలేక.. ఈ ఆలోచన నుంచి నేను బయటకు రాలేకపోతున్నా. అయోమయంగా ఉంది. ఏకాగ్రత చేయలేకపోతున్నా' అంటూ ఆ లేఖలో వాపోయాడు. వైద్య విద్య ఒత్తిడిని తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News