Ice Cream Side Effects: ఎండా కాలంలో అందరూ ఐస్‌క్రీమ్ తినడానికి ఇష్టపడుతారు. అయితే చాలా మంది వర్షాకాలంలో కూడా ఐస్‌క్రీమ్ విచ్చలవిడిగా తింటున్నారు ఇలా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వానా కాలంలో వీటిని తినే ముందు తప్పకుండా దానికి సంబంధించిన దుష్ప్రభావాలను తప్పకుంగా తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. అయితే చాలా మంది ఐస్‌క్రీమ్ తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదని నిపుణులు చెబుతున్నారు. అయితే వానా కాలంలో ఐస్‌క్రీమ్ తినడం వల్ల ఎలాంటి శరీర సమస్యలు ఉత్పన్నమవుతాయో తెలుసుకుందాం..
వానా కాలం గడ్డలాంటి ఐస్ క్రీమ్ తినడం వల్ల కలిగే నష్టాలు:
ఛాతీ బిగుతుగా మారడం:
వర్షాకాలంలోవాతావరణంలో చల్లని తేమ శాతం అధిక పరిమాణంలో ఉంటుంది. కావున ఐస్ క్రీమ్ తినడం వల్ల శరీరంపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. వీటిని తీసదుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఛాతీ బిగువు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
తలనొప్పి:
వానా కాలంలో ఐస్ క్రీం, చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల మెదడుపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. వానా కాలంలో చల్లని ఐస్ క్రీమ్ తినడం వల్ల తీవ్రమైన తలనొప్పికి దారి తీసే అవకాశాలున్నాయి. కావున వర్షాకాలంలో ఐస్ క్రీం తిసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గొంతు ఇన్ఫెక్షన్:
వర్షాకాలంలో ఐస్ క్రీం ఎక్కువగా తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చి.. కఫం వల్ల దగ్గు, జ్వరం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ శక్తి బలహీనంగా మారుతుంది:
వర్షాకాలంలో అంటువ్యాధుల సంక్రమణ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రమాదం వ్యాధులకు దారీ తిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వానా కాలంలో ఐస్ క్రీం తీసుకుంటే రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Monsoon Health Tips: వానా కాలంలో వచ్చే జబ్బులేవైనా.. ఇలా అల్లంతో చెక్ పెట్టొచ్చు..!
Also read: Hair Care Tips: స్ట్రెయిటెనింగ్ చేసిన తర్వాత జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook