Cheapest Electric SUV 2023: ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువై పోయింది. దానికి తగ్గట్టుకుగానే కంపెనీలు కూడా ఈ-వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మాంచి బ్రాండ్ ఉన్న కంపెనీల్లో టాటా మోటార్స్ ఒకటి. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ఎస్ఈవీ టాటా నెక్సాన్. ఈ కంపెనీ టాటా టియాగో మరియు టిగోర్లను ఎలక్ట్రిక్ వెర్షన్లలో విక్రయిస్తుంది. తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టింది. త్వరలో డెడ్ ఛీప్ ఎలక్ట్రిక్ కారును తీసుకరాబోతుంది.
2023 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెర్షన్ కు సంబంధించిన హారియర్ ఎస్ఈవీను పరిచయం చేసింది. దీనిని త్వరలోనే లాంఛ్ చేయనుంది. ఈ ఎస్ఈవీని నెక్సాన్ కంటే తక్కువ ధరకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి టాటా పంచ్ మైక్రో ఎస్ఈవీ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.
టాటా పంచ్ ఎస్ఈవీ వాహనం జనరేషన్ 2 (సిగ్మా) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది టాటా అల్టోజ్ ఉపయోగించిన అల్పా ఆర్కిటెక్చర్‌కి సవరించిన వెర్షన్. ఈ EV రెండు బ్యాటరీ ప్యాక్ లతో రానుంది. ఇందులో ఒక బ్యాటరీ ప్యాక్ టియాగో EV, 26kWh మరియు మరొకటి నెక్సాన్ EV లాగా 30.2kWh బ్యాటరీ ప్యాక్ కావచ్చు. ఈ ఎస్ఈవీ ధర రూ.10 నుండి 14 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడలేదు. ఇదిగానీ లాంచ్ అయితే దేశంలో అత్యంచ చౌకైన ఎలక్ట్రిక్ ఎస్ఈవీ ఇదే అవుతుంది.
Also Read: Second Hand Cars: సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ కారుకే డిమాండ్, ధర కేవలం 2.5 లక్షలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook