Venkatesh Viral Video: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. స్టార్ సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్..ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తే ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో విక్టరీ వెంకటేష్ మరొకసారి తన కామెడీతో మార్క్ చూపించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా సరికొత్తగా అనిపించిందని చెప్పవచ్చు.
వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు సమర్పణలో వచ్చిన ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మించారు. అంతేకాదు ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గురు స్టార్ హీరోలు తమ సినిమాలతో ముందుకు రాగా సంక్రాంతి విజయం వెంకటేష్ కే వరించింది అని చెప్పడంలో సందేహం.
సాధారణంగా వెంకటేష్ ఫ్యామిలీ మీడియా ముందుకు రావడం అత్యంత అరుదు. అలాంటిది ఇప్పుడు ఆయన కుటుంబమే కాదు మనవరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే విక్టరీ వెంకటేష్, నీరజారెడ్డి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు.. ఒక అబ్బాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వీరిలో పెద్దమ్మాయి ఆశ్రిత ఎక్కువగా వంటలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది.
అంతేకాదు ఈమె అప్పుడప్పుడు తన బావ నాగచైతన్యతో కూడా కలిసి వంటలు చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తొలిసారి తన కూతుర్ని అందరి ముందుకు తీసుకొచ్చింది.
అందులో బేబీ యూనికాన్ కలర్స్ లో ఉండే ఒక కేక్ తయారు చేసింది ఈ చిన్నారి. ఇక దానిని తన తాతయ్య వెంకటేష్ కి రుచి చూపించింది. వెంటనే తన తాతయ్య సర్ప్రైజ్ అయిపోయి మనవరాలితో కాస్త టైం స్పెండ్ చేశారు. నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు నువ్వు చేసిన ఈ వంటకం అందరికీ రుచి చూపించు అంటూ పాపతో సరదాగా మాట్లాడుతూ ఆకట్టుకున్నారు.
ఇక ఆశ్రిత కూతుర్ని చూసే ప్రతి ఒక్కరూ వెంకటేష్ మనవరాలు ఇంత అందంగా ఉందా ఈ పాపని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావచ్చు కదా అంటూ.. అప్పుడే తమ కోరికలు బయటపెడుతున్నారు. మరి కొంతమంది ఆ పాప కూడా తల్లిలాగే మంచి చెఫ్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: YS Sharmila: 'సూపర్ సిక్స్ ఇవ్వలేక.. ఆడలేక మద్దెల దరువన్నట్టు చంద్రబాబు తీరు'
Also Read: Muppa Raja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'సస్పెండ్ ద లీడర్'.. ముప్పా రాజాపై వేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.