Veera Simha Reddy Collections Vs Waltair Veerayya Collections: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతిపెద్ద పండుగ, అందుకే సినిమాలు కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. అదేవిధంగా ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ముందుగా జనవరి 12వ తేదీన విడుదల అవ్వగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన విడుదలైంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అదే విధంగా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి రెండు సినిమాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇలా ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒకే పండుగకు రెండు సినిమాలు రిలీజ్ కావడం అనేది ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలా జరగడమే గాక రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ నటించడంతో ఈ రెండు సినిమాల మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ వసూలు చేస్తుందని ఇద్దరు హీరోలు అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమా పది రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటే వీర సింహారెడ్డి సినిమా 11 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. రెండు సినిమాల మధ్య కలెక్షన్స్ తేడా ఎలా ఉంది అనేది పరిశీలిద్దాం.
ముందుగా వీర సింహారెడ్డి సినిమా విడుదలై 11 రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ 11 రోజుల పాటు వసూళ్లు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే 11 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్ల 39 లక్షల షేర్, 102 కోట్ల 55 లక్షల గ్రాస్ వసూలు చేయగా 11వ రోజు కోటిన్నర వరకు కలెక్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. వీర సింహారెడ్డి కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా 11 రోజులకు గాను నాలుగు కోట్ల 75 లక్షలు వసూలు చేస్తే ఒక్క ఓవర్సీస్ లో ఐదు కోట్ల 70 లక్షలు వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 73 కోట్ల 84 లక్షల షేర్ 124 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
ఇక వాల్తేరు వీరయ్య సినిమా మునుపెన్నడూ లేని విధంగా 10 రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 95 కోట్ల మూడు లక్షలు షేర్, 153 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ఈ దెబ్బతో ఈ సినిమా పదో రోజు నాన్ రాజమౌళి రికార్డు బద్దలు కొట్టేసింది వాల్తేరు వీరయ్య. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పది రోజులకు గాను 114 కోట్ల 13 లక్షల షేర్ వసూలు చేస్తే 195 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూలు చేసిందని చెప్పొచ్చు. ఒకరకంగా బాలకృష్ణ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 73 కోట్ల 84 లక్షల షేర్ 124 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేయగా వాల్తేరు వీరయ్య 114 కోట్ల 13 లక్షల షేర్ వసూలు చేస్తే 195 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
Also Read: Waltair Veerayya Day 10 Collections: పదో రోజు రచ్చ రేపిన చిరు.. నాన్ రాజమౌళి రికార్డు నమోదు!
Also Read: Veera Simha Reddy 11 Days: 11వ రోజు వీర సింహం జోరు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకెంత దూరమంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook