తెలుగు సినిమా మేటి నటుడిని కోల్పోయింది. కేవలం నటనతోనే కాకుండా..తెలుగు సినిమాలో సరికొత్త ఆవిష్కరణలు చేసిన వ్యక్తి. తెలుగు సినిమాకు కొత్త సొబగులు అద్దారు. ఆ వివరాలు మీ కోసం..
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయనదో ప్రత్యేక స్థానం. కేవలం నటనా సామర్ధ్యంతోనే కాకుండా..తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా ఆయన చేసిన పరిచయాలు చాలా ఎక్కువ. కొన్ని పాత్రలకు ఆయన ఎలా జీవం పోశారంటే..ఆ పాత్రలు గుర్తు చేసుకుంటే కృష్ణే గుర్తొస్తారు.
ఉదాహరణకు తెల్లదొరల్ని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారో చాలామందికి ఇప్పటికీ తెలియదు కానీ అల్లూరి పేరు వింటే కృష్ణ ముఖమే గుర్తొస్తుంది. అదీ ఆయనలో ప్రత్యేకత. ఇక జేమ్స్‌బాండ్ పాత్ర పేరు చెప్పినా కృష్ణ గుర్తుకురావల్సిందే. ఈ రెండు పాత్రలు ఆయన నటనా ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు.
కేవలం నటన విషయంలోనే కాదు..తెలుగు సినీ పరిశ్రమకు కొత్త టెక్నాలజీని అందించిన ఘనత కూడా ఆయనదే. మొదటి స్కోప్ సినిమా కావచ్చు..తొలి స్టీరియో ఫోనిక్ సౌండ్ సినిమా కావచ్చు..తొలి 70 ఎంఎం సినిమా కావచ్చు..ఈ మూడూ ఆయన పరిచయం చేసినవే. మధ్యలో కొన్ని ఎత్తుపల్లాలు చూసినా..ఆ తరువాత అద్భుత విజయాలతో దూసుకుపోయారు. పరాజయాల గురించి దిగులు చెందకుండా..సినిమాలే ఊపిరిగా ముందుకు కొనసాగి..346 సినిమాల్లో నటించారు.
తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమాగా కృష్ణ నటించిన ఈనాడు సినిమాను చెప్పుకోవచ్చు. ఇక తొలి డీటీఎస్ సినిమాగా తెలుగు వీర లేవరా సినిమా ఉండనే ఉంది. కృష్ణ నటనా జీవితంలో రెండు దశలున్నాయి. రెండవ దశలో నెంబర్ వన్, యమలీలలో ఆయన పాట ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక మంది నటులతో కలిసి నటించిన ఘనత కూడా కృష్ణకే దక్కుతుంది. మూడు తరాల నటులతో కలిసి నటించిన మేటి నటుడు కృష్ణకు జోహార్..
Also read: Krishna Passed Away: ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ షేక్.. వరుసగా 12 సినిమాలు ఫ్లాప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook