Sivakarthikeyan Prince కొంత మంది హీరోలు తమ సినిమా రిలీజ్ వరకే పట్టించుకుంటారు. తమ డబ్బులు తమ చేతిలోకి వచ్చి పడ్డాయా? లేదా? అంతే అన్నట్టుగా ఉంటారు. సినిమా రిలీజ్ అయి ఫ్లాపుగా మిగిలితే వచ్చే నష్టాలను, కష్టాలను పట్టించుకోరు కొందరు హీరోలు. కానీ కొంత మంది మాత్రం తమ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉంటారు. తాము తీసుకున్న రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇచ్చేస్తారు. కొంత మంది మొత్తం తిరిగిస్తే.. ఇంకొందరు మాత్రం సగమైనా ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. మరి కొంత మంది డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తుంటారు.
ఇలా డబ్బులు తిరిగి ఇవ్వడం, డిస్ట్రిబ్యూటర్లను, నిర్మాతలను ఆదుకోవడం రజినీకాంత్ బాబా సినిమాతోనే మొదలైంది. బాబా సినిమా ఫ్లాప్ అవ్వడంతో రజినీకాంత్ డబ్బులు వెనక్కి ఇచ్చాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ అలా తిరిగి ఇచ్చేస్తాడనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు శివ కార్తికేయన్ కూడా అదే బాటలో నడుస్తోన్నట్టుగా కనిపిస్తోంది.
జాతి రత్నాలు సినిమా కేవీ అనుదీప్ తెలుగులో సంచలనంగా మారాడు. జాతి రత్నాలు సినిమాతో వచ్చిన క్రేజ్‌తో అనుదీప్ ప్రిన్స్ కథను శివ కార్తికేయన్‌కు చెప్పగలిగాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసినా కూడా ఇది పూర్తిగా తమిళ సినిమాగానే ఉంటుంది.
అయితే ప్రిన్స్ సినిమాను రెండు చోట్లా తిరస్కరించారు ఆడియెన్స్. దీంతో ప్రిన్స్ సినిమాకు కష్టాలు వచ్చి పడ్డాయి. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు హీరో శివ కార్తికేయన్ ముందుకు వచ్చాడు. నష్టపోయిన మొత్తంలో సగం ఇచ్చేశాడట. అంటే దాదాపు ఆరు కోట్లు తన డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇచ్చాడట.
Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి