Sharwanand Ties Knot with NRI మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఓ యంగ్ హీరో బయటపడబోతోన్నాడు. గత ఏడాది నిఖిల్, నితిన్ వంటి హీరోలు పెళ్లి చేసుకున్నారు. రానా కూడా పెళ్లి చేసుకున్నాడు. హాయిగా ఉన్నాడు. అయితే మన హీరోలంతా కూడా ప్రభాస్ పెళ్లి తప్పించుకుంటూ ఉంటారు. అందులో శర్వానంద్ మొదటి వాడు. అయితే శర్వా కూడా ఇప్పుడు ఆ చాన్స్ తీసుకోవడం లేదు. ఇకపై ప్రభాస్ పెళ్లి తరువాతే తన పెళ్లి అని అనడు. ఎందుకంటే శర్వానంద్‌కు పెళ్లి కుదిరింది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎన్నారై అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకోబోతోన్నాడట.
అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహాం మాత్రమే కాదని, తాను ప్రేమించిన అమ్మాయినే ఇలా అరెంజ్డ్ మ్యారెజ్‌గా సెట్ చేశాడని తెలుస్తోంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. పైగా ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ అమ్మాయి అని, ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా హైదరాబాద్‌లోనే ఉంటోందట. ఆ అమ్మాయి ఎవరు? పేరేంటి? పెళ్లి ఎప్పుడు అనే విషయాలను శర్వానంద్ త్వరలోనే ప్రకటిస్తాడని తెలుస్తోంది.
శర్వానంద్‌కు ఈ ఏడాది ఒక హిట్ ఒక ఫ్లాప్ వచ్చి పడ్డాయి. అసలే శర్వానంద్‌కు చాలా కాలం నుంచి హిట్ లేకుండా పోయింది. మహాసముద్రం ఫ్లాప్ అయింది. ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా ఫ్లాప్ అయింది. అయితే ఒకే ఒక జీవితం అనే సినిమా మాత్రం మంచి టాక్‌తో హిట్‌గా నిలిచింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చినట్టు తెలుస్తోంది.
మొన్నీ మధ్యే అన్ స్టాపబుల్ షోలో శర్వానంద్ పెళ్లి ప్రస్థావన తెచ్చాడు. ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. శర్వా ఈ సారి న్యూ ఇయర్ వేడుకలను చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్‌తో కలిసి చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట
Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి