Ranbir Kapoor: ఆ ముగ్గురికి భయపడతాను అంటున్న రణబీర్ కపూర్…

Animal Pre-release event: యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి, మహేష్ బాబు లాంటి ప్రముఖులు హాజరు కావడం విశేషం. ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2023, 10:52 AM IST
Ranbir Kapoor: ఆ ముగ్గురికి భయపడతాను అంటున్న రణబీర్ కపూర్…

Animal: బ్రహ్మాస్త్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హిందీ హీరో రణబీర్ కపూర్. ఇక ప్రస్తుతం ఈ హీరో అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషన్ సినిమా తీసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. డిసెంబర్ 1 విడుదల కానున్న ఈ చిత్ర టైలర్ ఈ మధ్యనే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు సినిమా యూనిట్. ఈ ఈవెంట్ కి మహేష్ బాబు, రాజమౌళి చీఫ్ గెస్ట్లుగా హాజరయ్యారు.

కాగా.. రణబీర్ కపూర్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తన స్పీచ్ స్టార్ట్ చేసిన రణబీర్ కపూర్ మహేష్ బాబు దగ్గరికి రాగానే జై బాబు అన్నారు. ఇక దాంతో ప్రాంగణం మొత్తం అరుపులు మొదలైపోయాయి. ఆ తరువాత తాను కలసిన మొదటి సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలుపుకొచ్చారు ఈ హీరో. అంతేకాదు  తాను మహేష్ బాబు ఒక్కడు సినిమా చూసి మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని.. ఒక్కడు సినిమా చూడగానే మహేష్ బాబుకి అదే విషయం మెసేజ్ పెట్టగా ఆయన కూడా తనకు రిప్లై ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు.

ఇక ఆ తరువాత సుమా రణబీర్ కపూర్ ని కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడగడం ప్రారంభించింది. మొదటగా తాను ఎక్కువ భయపడేది ఎవరికి అని అడిగి మూడు ఆప్షన్లు ఇచ్చింది సుమ.. అయితే సుమ ఇచ్చిన 3 ఆప్షన్లు కూడా భార్య అనే పదాన్ని మూడు డిఫరెంట్ లాంగ్వేజస్ లో చెప్పింది. వైఫ్.‌ భార్య ..పత్ని.. ఈ ముగ్గురిలో ఎవరికి భయపడతారు అనగా.. రణబీర్ మరింత తమాషాగా ముగ్గురికి భయపడతాను అని చెప్పుకొచ్చారు. ఇక రణబీర్ భార్య ప్రముఖ హీరోయిన్ ఆలియాభట్ అన్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఆ తరువాత మహేష్ బాబు డైలాగ్ ఏదైనా చెప్పమని సుమా అడగగా.. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని డైలాగ్ చెప్పి అక్కడ ఉన్న వారిని ఖుషి చేశారు ఈ హీరో.

Also Read: IPL 2024 Purse Details: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ, ఏ జట్టు పర్సులో ఎంత ఉందో తెలుసా.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News