Pooja Hegde iron leg : ఒక లైలా కోసం చిత్రంతో నాగ చైతన్య సరసన హిరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ పూజా హెగ్డే. ముకుంద చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత, బన్నీ సరసన డీజేలో గ్లామర్ షోతో కుర్రకారును కట్టిపడేసింది. అలా క్రేజ్ సంపాదించుకున్న పూజా రామ్‌చరణ్ రంగస్థలంలో జిగేల్ రాణిగా స్పెషల్ సాంగ్‌లో చేసి మెరిసింది. ఆ తర్వాత సాక్ష్యంలో హిరోయిన్‌గా నటించిన పూజా అరవింద సమేత వీర రాఘవలో ఎన్టీఆర్ సరసన ఆకట్టుకుంది. మహేశ్‌బాబు సరసన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రంతో పూజా మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ గణేశ్‌లో రెండోసారి నటించిన పూజా... బన్నీ సరసన అలవైకుంఠ పురంలో సినిమాలో నటించి యూత్ గుండెల్లో గుబులు రేపింది.
అల వైకుంఠ పురంలో తరువాత పూజా నటించిన మూడు తెలుగు సినిమాలు విడులయ్యాయి. వీటిలో తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, రాధేశ్యామ్, తమిళ డబ్బింగ్ సినిమా బీస్ట్ ఉన్నాయి. ఆ తర్వాత తాజాగా విడుదలైన చిత్రం ఆచార్య. రామ్‌చరణ్ సరసన నీలాంబరి పాత్రలో నటించింది పూజా హెగ్డే. తాజాగా విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవటంతో ఇప్పుడు పూజాపై ఐరన్ లెగ్ ముద్ర వేస్తున్నారు నెటిజన్లు. రాధేశ్యామ్ భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఆచార్య అంచనాలు పెంచేసినా... మిక్స్‌డ్ టాక్ రావటంతో అంతా పూజాహెగ్డే వైపు వేలు చూపిస్తున్నారు.
ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించటంతో వాళ్లిద్దరినీ ఒకే తెరపై చూపిస్తున్న క్రెడిట్ ఈ మూవీకి దక్కింది. దర్శకుడు కొరటాల శివ ట్రాక్ రికార్డ్ చూస్తే.. ఆచార్యకు ముందు విడుదలైన ఆయన సినిమాలన్నీ సూపర్ హిట్లే. అలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య మిక్స్‌డ్ టాక్ దక్కించుకోవటం ఏంటా అని మెగా అభిమానులు కారణాలు వెతికే పనిలో పడ్డారు. ఆ వేటలో అన్ని వేళ్లూ పూజా హెగ్డే వైపు చూపిస్తున్నాయి. పూజా ఇటీవల నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ పొందినవే. రాధేశ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు ఫ్లాప్ టాక్ మూటకట్టుకోగా.. మెగాస్టార్ ఆచార్య కూడా.. తొలి రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇలా వరుసగా పూజా సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో అభిమానులు పూజా హెగ్డే టైమ్ బాలేదని, ఐరన్ లెగ్ అయిపోయిందని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
ఆచార్య చిత్రంలో పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో నటించింది. గత చిత్రాల్లో పోషించిన గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఆచార్యలో ఓ గ్రామీణ యువతి పాత్రలో నటించింది పూజా. ఈ చిత్రం గురించి దర్శకుడు కొరటాల శివ చెప్పగానే అంగీకరించినట్లు తెలిపింది పూజా. కొరటాల కథ చెప్పగానే అదో అందమైన కథలా అనిపించిదని పేర్కొంది పూజా. అందులో నటించాలని తనకు వెంటనే అనిపించిందని, నీలాంబరి పాత్ర జీవితంలో మరచిపోలేనిదని చెప్పుకొచ్చింది. చిరంజీవి(chiranjeevi) సెట్స్‌లో ఉన్నప్పుడు తనదైన స్టైల్ కనిపిస్తుందని, అతని స్టైల్ కొంతైనా తనకు రావాలని కోరుకుంటున్నానంది పూజా.
Also Read : Acharya Movie : ఆచార్య కొరటాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదా..?
Also Read : Mega Vs Manchu fans : ఆచార్యపై ట్రోల్స్.. మంచు ఫ్యాన్స్‌పై మెగా అభిమానుల ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.