Pawan Kalyan - Hari Hara Veera Mallu: మన దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. పవర్ స్టార్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులు చేసే హంగామానే వేరు. ఇక ఈయన సినిమాలకు సంబంధించిన ఏ వార్త అయినా.. అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా ఈయన తన కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా 'హరి హర వీరమల్లు' సినిమాతో పలకరించబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 17వ శతాబ్ధంలో పేదల పక్షనా పోరాడిన ఓ యోధుడే 'హరి హర వీరమల్లు'. పెద్దలను కొట్టు.. పేదలకు పెట్టు అనేది హరి హర వీరమల్లు నినాదం. పూర్తి యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమా కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట వంటి భారీ సెట్స్ వేసారు. మరోవైపు మచలీ పట్నం ఓడరేవును కూడా ప్రత్యేకంగా రీ క్రియేట్ చేసారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ముఖ్యంగా టీజర్‌లో చూపించిన చార్మినార్, ఎర్రకోట సెట్స్ చూస్తే.. నిజంగా వాటి దగ్గరే ఈ సినిమాను షూట్ చేసారా అనే లెవల్లో ఉంది. మొత్తంగా ఈ సినిమా ఆర్ట్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వీరమల్లుగా సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ సాహసాలను చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు టీజర్ సమాధానం ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మొదటి భాగం .. హరి హర వీరమల్లు పార్ట్ -1'.. స్వోర్ట్ వర్సెస్ స్పిరిట్' గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధర్మం కోసం యుద్ధం అనేది ట్యాగ్ లైన్.
పేదలు దోపిడికి గురువతూ.. ధనవంతులు మరింత ధనవంతులుగా మారతున్న వేళలో న్యాయం కోసం ధర్మ యుద్ధం చేసే ఒంటిరి యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాకు మొదటిసారి ఆస్కార్ అవార్డ్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కళ్లు చెదిరే విజువల్స్, భారీ సెట్లు.. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
పేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలబడే యోధుడు హరి హర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు.మొఘల్ చక్రవర్తి పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ కనిపిస్తున్నారు. ఇద్దరూ కూడా ఆహార్యం, అభినయం పరంగా ఆయా పాత్రలకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. చట్ట విరుద్ధంగా నైనా.. న్యాయం కోసం పేదల పక్షాన ఓ యోధుడు చేస్తోన్న పోరాటమే 'హరి హర వీరమల్లు' మూవీ స్టోరీ.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విషయానికొస్తే.. ఇప్పటికే 'కంచె', 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'మణికర్ణిక', ఎన్టీఆర్ బయోపిక్ వంటి చారిత్రక , బయోపిక్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అణచివేతదారులకు వ్యతిరేకంగా, తమ దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడిన యోధులను ఆయా చిత్రాలలో చూపించారు. "హరి హర వీర మల్లు" కూడా అలాంటి యోధుడి స్టోరీనే. అతడు ధనవంతులు.. దుష్ట పాలకుల నుండి దోచుకొని.. పేద ప్రజలకు ధనాన్ని పంచిపెట్టే నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాను "ఎనక్కు 20 ఉనక్కు 18", "నీ మనసు నాకు తెలుసు", "ఆక్సిజన్" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మరియు "నట్పుక్కాగ", "పడయప్ప" వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత-దర్శకుడు జ్యోతి కృష్ణ, 'హరి హర వీర మల్లు' చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ పార్ట్‌ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు అందాల నటి నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా పనిచేస్తున్నారు.'హరి హర వీర మల్లు' చిత్రాన్ని 2024 చివర్లో విడుదల చేయనున్నట్టు ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేసారు.
నటీనటులు & సాంకేతిక నిపుణుల వివరాలు:
తారాగణం: పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, ఎం. నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు
Also read: Mahindra XUV 3XO: కేవలం 7.49 లక్షలకే Mahindra XUV 3XO లాంచ్, మే 15 నుంచి బుకింగ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook