New Controversy Over Scenes Of Adipurush: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ టీజర్ తాజాగా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ మీద మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఈ సినిమా టీజర్ దారుణంగా ఉందని, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ షాట్స్ చాలా చీప్ గా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఒక కొత్త వాదన తెర మీదకు తీసుకు వచ్చారు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన ఆదిపురుష్ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై సినిమా దర్శకుడు ఓం రౌత్‌కు లేఖ రాస్తానని చెప్పారు.
అంతేకాదు తన లేఖను చూసి అభ్యంతరకర దృశ్యాలను తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ- ఆది పురుష్ సినిమా టీజర్ చూశాను, అయితే అందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి’’ అని అన్నారు. హిందూ విశ్వాసానికి సంబంధించిన కొన్ని విషయాలను చూపించే విధానం అందులో సరిగా లేదని ఆయన అన్నారు.
టీజర్లో హనుమంతుడు ధరించిన అంగవస్త్రం తోలుతో(లెదర్ తో) తయారు చేసినట్టు చూపించారని ఆయన అన్నారు. హనుమాన్ చాలీసాలో హనుమంతుడు ఎలా ఉంటారనేది వర్ణన స్పష్టంగా వివరించబడిందని కానీ దర్శకుడు ఇంకేదో చేసి చూపించారని మిశ్రా విమర్శించారు. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ..మిశ్రా ప్రతిసారీ మా దేవుడిని ఎందుకు ఇలా కించపరుస్తున్నారు? వేరొకరి దేవుడిపై ఇలాంటివి ఎందుకు చేయరు? దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.
Madhya Padesh Home Minister Warns Of Legal Action over Adipurush:
ఇది ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాల మీద దాడి చేసినట్టే అని ఆయన అభివర్ణించారు. మిశ్రా మాట్లాడుతూ ఈ అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించాలని చిత్ర దర్శక నిర్మాత ఓం రౌత్‌కి లేఖ రాస్తున్నానని, వారు సీన్‌ను తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మధ్యప్రదేశ్ మంత్రితో పాటు, సామాజిక సంస్థ ‘’హిందూ మహాసభ’’ కూడా సినిమా సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలో చూపించిన సన్నివేశాలకు వ్యతిరేకంగా హిందూ మహాసభ గళమెత్తింది.
నిజానికి అంతకుముందు కూడా నటి, బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ కూడా ఓం రౌత్‌ను టార్గెట్గా చేసుకుని కొన్ని కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని తప్పుగా ప్రజెంట్ చేశారని అన్నారు. ఈ సినిమా టీజర్లో రావణుడిని(సైఫ్ అలీ ఖాన్) చూపించిన తీరు తప్పని మాళవిక అన్నారు. దర్శకుడు ఓం రౌత్ వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, తులసీదాసు రామాయణం వంటివి అందుబాటులో ఉండగా వాటిని ఏమాత్రం పరిశోధించకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. నిజానికి రామాయణం మీద చేసిన కన్నడ సినిమాలు చాలా ఉన్నాయి. అవి కాక తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు రావణుడు ఎలా ఉండేవాడో తెలియజేస్తాయని ఆమె అన్నారు.
కానీ ఓం రౌత్ ఈ విషయం మీద వర్క్ చేసినట్టు అనిపించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక అక్టోబర్ 2న అయోధ్యలో ఆదిపురుష్ సినిమా టీజర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో ప్రభాస్, హీరోయిన్ కీర్తి సనన్, డైరెక్టర్ ఓం రౌత్ పాల్గొన్నారు. ఇక ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరి 12న హిందీతో సహా అన్ని దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ మాత సీతగా నటించారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తుండగా, సన్నీ సింగ్ లక్ష్మణ్‌గా, దేవదత్ నాగే హనుమంతుడిగా కనిపించనున్నారు.
Also Read: Viran in Allu Arjun's Zomato Ad: సొంత కుంపటిని బలపరుచుకుంటున్న అల్లు అర్జున్.. ఇక తగ్గేదేలే!
Also Read: Murali Mohapatra Death Reason: పాటలు పాడుతూనే ప్రముఖ సింగర్ మృతి.. ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook