Thala: ‘తల’ మూవీకి నాగార్జున అండ.. బుక్ మై షోలో ఫస్ట్ టికెట్ కొన్న కింగ్..

Thala: అమ్మ రాజశేఖర్ తనయుడు  అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ ‘తల’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు నాగార్జున అండగా నిలిచారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొని మూవీ యూనిట్ కు అండగా నిలబడ్డారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 13, 2025, 07:15 PM IST
Thala: ‘తల’ మూవీకి నాగార్జున అండ.. బుక్ మై షోలో ఫస్ట్ టికెట్ కొన్న కింగ్..

Thala: దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా  అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘తల'. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ కొడుకు అమ్మ రాగిన్ రాజ్  హీరోగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.  అంకిత నస్కర్ హీరోయిన్ గా నటించింది. రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల,సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, ఇంద్రజ ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు.

శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీతం అందించారు. ‘తల’ సినిమా ఈ 14న రిలీజ్  కాబోతోంది. ఇప్పటికే తల మూవీ  భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ చూసిన వాళ్లంతా బాగుందని మెచ్చుకుంటున్నారు.
ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
 తాజాగా కింగ్ నాగార్జున బుక్ మై షోలో ఈ మూవీ ఫస్ట్ టికెట్ ను కొని చిత్ర యూనిట్ కు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ఈ చిత్ర ట్రైలర్ ను చూసి చిత్ర యూనిట్ ను అభినందించారు. అంతేకాదు రాగిన్ రాజ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పెద్ద హీరో అవుతాడని ఆశీర్వదించారు.

అమ్మ రాజశేఖర్ దర్శకత్వం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని మెచ్చుకున్నారు. అమ్మ రాజశేఖర్ తో తన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుని ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత శ్రీనివాస్ గౌడ్ తో పాటు చిత్ర యూనిట్ కు  ఆల్ ద బెస్ట్ చెప్పారు. బుక్ మై షోలో నాగార్జున తల మూవీ ఫస్ట్ టికెట్ ను కొనడం ఈ చిత్రం సాధించబోతోన్న పెద్ద విజయానికి చిహ్నం అని దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ సందర్భంగా సంతోషాన్ని  వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News