Manjula - Nirupam : నీలాంటి మొగుడి దొరికినందుకు లక్కీ.. థాంక్స్ రా.. డాక్టర్ బాబుపై మంజుల ఎమోషనల్ పోస్ట్

Manjula Paritala Nirupam Wedding Anniversary మంజుల నిరుపమ్ సోషల్ మీడియాలో ఎంత సందడిగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ నెట్టింట్లో చేసే హంగామాకు అందరూ ఫిదా అవుతుంటారు. భార్యాభర్తలంటే ఇలా ఉండాలనేట్టుగా అల్లరి చేస్తుంటారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2022, 06:56 PM IST
  • నెట్టింట్లో డాక్టర్ బాబు సందడి
  • మంజుల నిరుపమ్ పెళ్లి రోజు
  • భార్యాభర్తల పోస్టులు వైరల్
Manjula - Nirupam : నీలాంటి మొగుడి దొరికినందుకు లక్కీ.. థాంక్స్ రా.. డాక్టర్ బాబుపై మంజుల ఎమోషనల్ పోస్ట్

Manjula - Nirupam : బుల్లితెరపై మంజుల నిరుపమ్ జోడికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసింది. చంద్రముఖి సీరియల్‌తో వీరి ప్రయాణం మొదలైంది. కన్నడ నటి అయిన మంజలు చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికి నిరుపమ్ కూడా సీరియళ్లకు కొత్తే. అలా చంద్రముఖి సీరియల్ జరుగుతుండగానే.. వీరి మధ్య బంధం మొదలైంది. స్నేహం కాస్త ప్రేమగా మారిందట. చివర్లో వీరి వెడ్డింగ్ కార్డ్ సీరియల్ యూనిట్‌కు ఇస్తుంటే అందరూ షాక్ అయ్యారట. ఇది ఎప్పుడు జరిగిందని అందరూ అవాక్కయ్యారు.

అలా వారిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచేవారట. ఇక వారు సెట్లో కంటే.. ఫోన్లోనే ఎక్కువగా మాట్లాడుకునేవారట. వారి సంపాదన అంతా కూడా ఫోన్ బిల్లులకే సరిపోయేదని సరదాగా చెబుతుంటుంది మంజుల. ఈ విషయాలన్ని కూడా మంజుల నిరుపమ్ ఇద్దరూ తమ తమ అభిమానులకు యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతుంటారు. బుల్లితెరపైనే కాకుండా ఈ జోడి సోషల్ మీడియాలోనూ బాగానే పాపులర్.

యూట్యూబ్‌లో మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ చానెల్ ఉంది. అందులో మంజుల రకరకాల వీడియోలు చేస్తుంటుంది. తన భర్త నిరుపమ్ గురించి, తన బాబు గురించి ఇలా పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. పర్సనల్ విషయాలు, ఇంట్లోని సంగతులు చెబుతుంది కాబట్టే.. ఆ వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఆ వీడియోల్లో మంజుల మీద నిరుపమ్ ఎప్పుడూ సెటైర్లు వేస్తూనే ఉంటాడు.

 

నార్మల్ భార్యాభర్తల్లానే ఈ ఇద్దరూ ప్రవర్తిస్తుంటారు. తాజాగా వీరు ఎమోషనల్ అయ్యారు. తమ పెళ్లి రోజు అంటూ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. తన భర్త గురించి మంజుల పోస్ట్ చేస్తూ ప్రేమను కురిపించింది. నీ లాంటి మొగుడు దొరికినందుకు ఈ ప్రపంచంలో నా అంత లక్కీ ఇంకొకరు లేరు.. నువ్ నాకోసం చేసిన వాటన్నంటికీ థాంక్స్ రా.. అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. తన భర్త ఎంతో బాధ్యతగా ఉంటాడని, ప్రేమగా చూసుకుంటాడని చెప్పేసింది.

 

ఇక నిరుపమ్ తన భార్య గురించి చెబుతూ.. ప్రేమ అనేది ఓ ఎమోషన్.. మ్యారేజ్ అనేది ఓ కమిట్మెంట్.. కలిసి ఉండటం అనేది ఓ గొప్ప అనుభూతి..  ఈ అనుభూతి నీతో ఎప్పుడూ ఉంటుంది.. హ్యాపీ యానివర్సరీ అని పోస్ట్ వేశాడు.

Also Read : Varsha Bollamma : హీరోల తమ్ముళ్లతో నటించడంపై వర్ష బొల్లమ్మ కామెంట్స్

Also Read : Allu Arjun Trivikram Shooting: అల్లు అర్జున్ తో షూట్ మొదలెట్టిన త్రివిక్రమ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter Facebook

Trending News