Allu Arjun Arrest Live Updates: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా.. ఒక్కసారి అభిమానులు భారీగా దూసుకువచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకోగా.. రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్లు అర్జున్‌ను ఒక నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.