Bedurulanka 2012 OTT Release: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన మూవీ 'బెదురులంక 2012'. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా క్లాక్స్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య తదితరులు కీ రోల్స్ చేశారు. ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగనే కలెక్షన్లను రాబట్టింది. నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా ఏడు కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చి ఈ మూవీ సాలిడ్ హిట్ కొట్టింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లోకి ఈ మూవీ విడుదలైంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాకముందే బెదురులంక ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. 2012లో యుగాంతం రాబోతుందనే పుకార్ల కారణంగా బెదురులంక అనే ఊరి ప్రజలు భయాందోళనలకు గురవుతుంటారు. ప్రజల్లోని భయం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భూషణం (అజయ్ ఘోష్) అనే లీడర్ ఊరిని దోచుకోవాలని చూస్తాడు. అతడి కుట్రను శివ (కార్తికేయ గుమ్మకొండ) ఎలా ఎదురించాడనేది మూవీ కథ.
ప్రేమతో మీ కార్తీక్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన, ఆర్‌ఎక్స్ 100తో కార్తికేయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కార్తికేయ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అనంతరం వచ్చిన హిప్పీ, గుణ 369, 90ఎంఎల్, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా సరే ఇతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని గ్యాంగ్ లీడర్, వలిమై సినిమాల్లో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు కార్తికేయ.
Also Read: Nayanthara Angry With Jawan Director: బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన జవాన్ దర్శకుడిపై నయనతార ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook