Nithiin: తండ్రి అయిన నితిన్.. ఫోటో షేర్ చేసిన హీరో..!

Nithiin Son: గత కొద్ది సంవత్సరాల క్రితమే నితిన్..శాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మధ్య ప్రెగ్నెంట్ గా ఉన్న శాలిని ఈరోజు పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఈ హీరో.. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మీకోసం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 6, 2024, 07:05 PM IST
Nithiin: తండ్రి అయిన నితిన్.. ఫోటో షేర్ చేసిన హీరో..!

Nithiin Son Photo: జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు టాలీవుడ్ హీరో నితిన్. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్యనే శాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కాగా నితిన్, శాలిని దంపతులకు ఈరోజు సెప్టెంబర్ ఆరవ తారీఖున.. పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇక ఇదే విషయాన్ని తెలియజేశారు నితిన్. తమ కుటుంబంలోకి కొత్త స్టార్‌ను ఆహ్వానిస్తున్నామని తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు నితిన్ ఓ ఫొటోను ట్వీట్ చేశాడు.

 

ఆనందాన్ని పంచుకుంటూ ఒక ఫోటో కూడా షేర్ చేశారు. తమ కుమారుడి చేతిని నితిన్, షాలిని పట్టుకున్నట్లు ఆ ఫోటోలో కనపడుతోంది. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నితిన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

కాగా నితిన్ తన స్నేహితురాలు షాలినీని 2020 జులై 26న వివాహం చేసుకున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. అందువలన కేవలం తన కుటుంబ సభ్యుల సమీక్షంలో పెళ్లి జరుపుకున్నారు ఈ హీరో.  ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాల షూటింగుతో నితిన్ బిజీగా ఉన్నారు. 

నితిన్ తన కెరియర్ మొదట్లో జయం, దిల్ అంటూ వరుసగా సూపర్ హిట్లు అందుకున్నారు.
ఆ తర్వాత హిట్లు లేక చాలా కాలం వరస ప్లాపులు అందుకుంటూ.. సరైన విజయం కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తరువాత ఈ మధ్య వచ్చిన భీష్మ సినిమా కూడా ఈ హీరోకి సక్సెస్ అందించింది. అయితే ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంతో మరో దిజాస్టర్ చవిచూశారు. మరి రాబోయే సినిమాలతో నితిన్ మరోసారి మంచి విజయం అందుకుంటారో లేదో వేచి చూడాలి.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్‌ రావు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Also Read: KCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్‌ విరాళం.. కేటీఆర్‌, కవితతో సహా అందరూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News