Gummadi Narsaiah Title Song: గుమ్మడి నర్సయ్య.. తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఏనాడూ కూడా పబ్లిసిటీ కూడా నోచుకోలేదు. తనకంటూ ఆస్తులు వెనకేసుకోవాలనే ఆలోచన రాలేదు. ఎమ్మెల్యేగా పనిచేసినంత కాలం బస్సు, ట్రైన్‌లోనే హైదరాబాద్‌కు వచ్చి.. ఆటోలో అసెంబ్లీకి హాజరయ్యేవారు. తాను పదవి కాలంలో ఉన్నన్ని రోజులు వచ్చిన జీతం మొత్తం పార్టీకి ఇచ్చేశారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా సైకిల్‌పైనే వెళుతూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఎలాంటి అవినీతి మచ్చలేకుండా.. పేదల పాలిట పెన్నిదిగా గుమ్మడి నర్సయ్యకు పేరు ఉంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది.
డార్క్ టు లైట్ క్రియేటర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న గుమ్మడి నర్సయ్య చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలె దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ బాధ్యతలను అఖిల్ వల్లూరి నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా సత్య గిడుతూరి పనిచేస్తున్నారు. తాజాగా గుమ్మడి నర్సయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలె మాట్లాడుతూ.. గుమ్మడి నర్సయ్య బర్త్ డే సందర్భంగా ఒక ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేశామని తెలిపారు. ఆడియన్స్ అందరూ చూసి తమ చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరారు. బయోపిక్ కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చాలా శ్రద్దగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకుని.. నిదానంగా సినిమాను రూపొందిస్తున్నామన్నారు. ఇక నుంచి మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ రెగ్యులర్‌గా ఇస్తామని తెలిపారు.
సాంగ్ విషయానికి వస్తే.. చరణ్ అర్జున్ అందించిన సంగీతం చాలా బాగుంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అద్భుతమైన సాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుమ్మడి నర్సయ్య వంటి గొప్ప వ్యక్తుల చరిత్రను ఇలాంటి సినిమాల ద్వారా తెలుసుకోవచ్చని అంటున్నారు. ఆయన వ్యక్తిత్వం, మంచితనానికి అద్దం పట్టేలా ఈ పాట ఉందని చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి