Koratala Siva Next Movie: ప్రభాస్ మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారిన కొరటాల శివ.. ఇప్పటిదాకా మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పటిదాకా కొరటాల శివ డైరెక్ట్ చేయని ఒకే ఒక్క హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే గతంలోనే కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా లాంచ్ అయింది కానీ.. సినిమా మాత్రం మొదలవలేదు. ఆ సినిమా స్థానంలోనే ఇప్పుడు దేవర పార్ట్ 1 విడుదలైంది.
మరి ఆ క్యాన్సిల్ అయిపోయిన సినిమా సంగతి తెలియకపోయినప్పటికీ.. తమ కాంబినేషన్ లో కచ్చితంగా ఒక సినిమా వస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు కొరటాల శివ. కొరటాల దర్శకత్వం వహించిన మిర్చి సినిమాని కుటుంబ సమేతంగా చూసిన అల్లు అర్జున్ చాలా ఎంజాయ్ చేశారట. అప్పటినుంచి కొరటాలతో శర్మ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని.. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వర్కౌట్ అవడం లేదు అని తెలుస్తోంది.
ఇప్పుడు మాత్రం కచ్చితంగా వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందట. మరోవైపు దేవర సినిమా బయట వాళ్ళు చూశారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు కొరటాల. బయట వాళ్ళు ఎవరు సినిమా చూడలేదు కానీ తాను ఎన్టీఆర్ కలిసి మూడుసార్లు చూసామని స్పష్టం చేశారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులు కూడా చూశారు అని.. సినిమా అందరికీ నచ్చింది అని అన్నారు.
జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఆచార్యతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ.. కొరటాల ఈ సినిమా అందుకుంటారని చెప్పుకోవచ్చు.
Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల
Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.