Malaika Arora, Arjun Kapoor: బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, మలైకా అరోరా రిలేషన్ ప్రారంభమైనప్పటి నుంచి తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. 50 ఏళ్ల మలైకా అరోరాతో ఎఫైర్‌పై యంగ్ హీరో అర్జున్ కపూర్ ఇలా స్పందించాడు.
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, ఎవర్గ్రీన్ ఎవర్ఫిట్ బ్యూటీ మలైకా అరోరా 2019లో రిలేషన్ షిప్‌ను బహిరంగం చేశారు. అప్పట్నించి ఈ ఇద్దరూ తరచూ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, విమర్శలు వస్తూనే ఉన్నాయి. మలైకా అరోరా ఇటీవలే విడాకులు తీసుకోవడం, ఇద్దరి మధ్య వయస్సులో చాలా తేడా ఉండటమే దీనికి కారణం. అన్ని విమర్శల్ని భరిస్తూనే రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమపై వస్తున్న ట్రోలింగ్, విమర్శలకు అర్జున్ కపూర్ సమాధానమిచ్చాడు. ఇద్దరి రిలేషన్ షిప్స్ వల్ల బహిరంగంగా కలిగే పరిణామాల గురించి మాట్లాడాడు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఊహాగానాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో వ్యక్తుల్ని ఎక్కువగా ఊహించుకుని రాయడం లేదా భావోద్వేగాల్ని పట్టించుకోకుండా వార్తలు రాయడం వల్ల సంబంధాలపై ప్రభావం చూపిస్తాయి. ఒకరిపట్ల మరొకరు కలిగి ఉండే భావాలు అర్ధం లేనివిగా మారుతాయి. భారతీయ ప్రజలు గాసిప్స్‌ను ఎలా ఇష్టపడతారనే అంశంపై కూడా అర్జున్ కపూర్ వివరణ ఇచ్చాడు.
ప్రజలు ఎప్పుడూ వివిధ రకాల అభిప్రాయాల్ని కలిగి ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఎక్కువగా కబుర్లు చెప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎవరికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది..ఆ ఇద్దరికీ కుదిరిందా లేదా వంటి విషయాలపై లేడీస్లా ప్రవర్తిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తుల కెరీర్ నాశనమవుతుంది. ఈ విషయాలపై మిమ్మలి మీరు ఓ సారి పరిశీలించుకోండి..అంతా అర్ధమవుతుందని అన్నాడు. మలైకాతో సంబంధాన్ని అధికారికం చేసినప్పటి నుంచి మలైకా కొడుకు అర్హాన్‌తో కూడా అర్జున్ మంచి బంధాన్ని ఏర్పర్చుకున్నాడు.
Also read: Mahesh babu poster: ఆకట్టుకుంటున్న మహేశ్ బాబు కొత్త పోస్టర్, సర్కారు వారి పాటలో మహేశ్ రఫ్ లుక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook